Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకంటే సుధీర్, ఇంద్రగంటి మ‌ధ్య కెమిస్ట్రీ సూప‌ర్‌ - కృతిశెట్టి

Advertiesment
Kriti Shetty
, సోమవారం, 19 సెప్టెంబరు 2022 (10:24 IST)
Kriti Shetty
సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వచ్చిన చిత్రం''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'.  సుధీర్ బాబుకు జోడిగా కృతిశెట్టి నటించారు. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో  సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 
 
ఈ సందర్భంగా హీరోయిన్ కృతిశెట్టి ప‌లు విష‌యాలు తెలియ‌జేసింది. నాకూ, సుధీర్ బాబు గారి కంటే సుధీర్, ఇంద్రగంటి గారి కెమిస్ట్రీ బావుంటుంది (నవ్వుతూ). సుధీర్, ఇంద్రగంటి గారి మధ్య గ్రేట్ వర్క్ ఎనర్జీ వుంటుంది. నేను పని చేసిన అందరు దర్శకులు, హీరోల దగ్గర మంచి విషయాలు నేర్చుకున్నాను. ఇంద్రగంటి గారి సినిమా షూటింగ్ స్పెషల్‌గా వుంటుంది. దాదాపు 70 రోజులు ఈ సినిమా కోసం పని చేశాను. ఇంద్రగంటి గారు  చాలా కూల్. తన పనిని చాలా ఎంజాయ్ చేస్తారు. సెట్ కి ప్రతి రోజు ఫ్రెష్ మైండ్ తో వస్తారు. చాలా అంశాలు ఆయన నుండి నేర్చుకున్నాను.
 
- కెరీర్ బిగినింగ్ లోనే ద్విపాత్రాభినయం చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అఖిల పాత్రని చాలా మంది ఇష్టపడుతున్నారు. ఒక నటిగా చాలా ఆనందంగా వుంది. నిజానికి నేను డాక్టర్ ని కావాలని అనుకున్నాను. ఒక యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం హైదరా బాద్ రావడం, తొలి సినిమా ఉప్పెన అవకాశం దొరకడం, తర్వాత మంచి మంచి పాత్రలు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. మరింత కష్టపడి మరిన్ని మంచి పాత్రలు , సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.
 
- సుధీర్ బాబు గారు వండర్ ఫుల్ కోస్టార్. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా వుంది. చాలా అంకిత భావంతో పని చేస్తారు. చాలా స్ఫూర్తిని నింపుతారు. సెట్స్ లో ఎంతో సహాయంగా వుంటారు. చాలా సున్నితమైన వ్యక్తి. ఆయనకి చాలా సలహాలు అడిగాను. ఎప్పుడూ చిరాకు పడలేదు.(నవ్వుతూ) ఈ విషయంలో సుధీర్ బాబు గారికి కృతజ్ఞతలు.
 
- మా అమ్మగారు చాలా ఎమోషనల్ అయ్యారు. నాన్న గారికి కూడా చాలా నచ్చింది. నేను ఈ పాత్ర చేయడం వారికీ చాలా గర్వంగా అనిపించింది. నా ఫ్యామిలీ నుండి నాకు పూర్తి ప్రోత్సాహం వుంది. ఈ విషయంలో నేను లక్కీ.
 
- నాగ చైతన్య, సూర్య గారి తో సినిమాలు చేస్తున్నా. మరికొన్ని ప్రాజెక్ట్స్ లైనప్ లో వున్నాయి. త్వరలోనే వివరాలు తెలుస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటిస్తున్నాను.. థ్యాంక్స్... రేణు దేశాయ్