Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్ చరణ్ ఇంట క్రిస్మస్ సందడి.. ఒకే ఫ్రేములో మెగాస్టార్స్

Advertiesment
megastars family
, బుధవారం, 21 డిశెంబరు 2022 (13:30 IST)
టాలీవుడ్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట మంగళవారం రాత్రి క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మెగా ఫ్యామిలీకి చెందిన నటీనటులంతా ఒక చోట చేశారు. ముఖ్యంగా మెగా కజిన్స్ అల్లు అర్జున్ - స్నేహా దంపతులు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, శిరీష్, సుస్మితా, శ్రీజ తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా వారంతా సరదా మాటలు, గేమ్స్‌తో ఎంజాయ్ చేశారు. సీక్రెట్ శాంతా గేమ్‌లో పాల్గొని, పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ ఫోటోలను చెర్రీ సతీమణి ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. 
 
స్టార్స్‌తో నిండిపోయిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ "కడుపు నిండిపోయింది.. చూడటానికి రెండు కళ్లు చాలడం లేదంటూ" తమ ఆనందాన్ని తెలుపుతున్నారు. కాగా, ఉపాసన తల్లికాబోతున్న తరుణంలో ఈ వేడుకలు మరింత గ్రాండ్‌గా నిర్వహించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల్లో అవతార్ కలెక్షన్ల వర్షం