Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా అమ్మకు బ్రెయిన్ వాష్ చేశారు : మంచు మనోజ్ (Video)

Advertiesment
manchu manoj

ఠాగూర్

, బుధవారం, 15 జనవరి 2025 (19:03 IST)
మా అమ్మకు బ్రెయిన్ వాష్ చేయించి మాట్లాడిస్తున్నారంటూ తన తండ్రి, సినీ నటుడు మోహన్ బాబు, అన్న మంచు విష్ణులపై హీరో మంచు మనోజ్ ఆరోపించారు. మోహన్ బాబు కుటుంబ గొడవలు రోజురోజుకూ పెద్దవి అవుతున్న విషయం తెల్సిందే. బుధవారం కూడా మరోమారి యూనివర్శిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి వెళ్లేందుకు మంచు మనోజ్ యత్నించగా, ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. తన తాత, నానమ్మల సమాధులు చూసేందుకు తనకు ఎవరి అనుమతి కావాలంటూ మనోజ్ ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్శిటీ లోపలకు అనుమతి లేదని మంచు మనోజ్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 
 
ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ, 'మా తాత నాన్నమ్మ సమాధులకు దండం పెట్టుకుందాం అని యూనివర్సిటీకి వచ్చాను. విద్యార్థుల కోసం ప్రశ్నించినందుకు నన్ను ఇంట్లోకి రానివ్వకుండా చేసి మా అమ్మ బ్రెయిన్ వాష్ చేశారు. మేము ఇక్కడికి వస్తున్నాం అని తెలిసి ఢిల్లీ నుంచి బౌన్సర్లను తీసుకొచ్చారు. రోడ్డు మీద పోలీసుల లాఠీలను రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు' అని ఆరోపించారు. 
 
ఈ క్రమంలో మోహన్ బాబు, మంచు మనోజ్ బౌన్సర్లు గొడవపడ్డారు. ఇరు వర్గాల బౌన్సర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు. రాళ్ళు రువ్వుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. తనకు గొడవచేసే ఉద్దేశం ఎంతమాత్రం లేదని, అనవసరంగా ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని మనోజ్ ప్రశ్నించారు. లోపలకు పంపిస్తే సమాధులకు దండం పెట్టుకుని వచ్చేస్తానని చెప్పారు. ఆ తర్వాత తీవ్ర ఉద్రిక్తతల మధ్యే మనోజ్‌ను, ఆయన భార్య మౌనికలను పోలీసులు లోపలికి అనుమతించగా, సమాధులకు దండం పెట్టుకున్న తర్వాత వారిద్దరూ బయటకు వచ్చేశారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుష్క శెట్టి ఫిల్మ్ ఘాటి నుంచి దేశీ రాజుగా విక్రమ్ ప్రభు గ్లింప్స్