Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్‌లో గొడవేంటి..?

tollywood industry

ఠాగూర్

, మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (12:01 IST)
గత కొద్ది రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్‌లో గొడవలు జరుగుతున్నాయి. ఈ యూనియన్ సభ్యుల మధ్య భూమి కొనుగోలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదం సాగుతుంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో సభ్యుల మధ్య మాటా మాటా పెరిగి తోపులాటకు దారితీసిన పరిస్థితి నెలకొంది.
 
విషయానికి వస్తే.‌. గతయేడాది బ్యాంకు అధికారులతో కలసి తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ ఖాతాలో ఉన్న కోట్లాది రూపాయలను గుట్టుచప్పుడుకాకుండా అప్పటి కార్యవర్గ సభ్యులు కొట్టేశారనీ, ఈ విషయాన్ని ప్రశ్నించగా వారిపై కార్యవర్గ సభ్యులు ఎదురుదాడికి దిగారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పట్లో ఈ వివాదం సీసీఎస్ పోలీసు స్టేషన్‌‌లో కూడా ఫిర్యాదు చేశారు. 
 
నిజానికి తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ ఎన్నో సంవత్సరాలుగా ఉంది. ఇందులో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్, ఉపాధ్యక్షులతో కలిపి దాదాపు 700 మంది వరకు సభ్యులు ఉన్నారు. వీరికి జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంది. దీనిలో మొత్తం కోట్ల రూపాయల ఫండ్స్ ఉన్నాయి. యూనియన్ బైలా ప్రకారం యూనియన్‌లో ఉన్న వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రతిపాదన ఎంతో కాలం నుంచి ఉంది. అయితే గతేడాది మే నెలలో ప్రెసిడెంట్ సత్యనారాయణ దొరై ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ సుధాకర్, ట్రెజరర్ రాజేష్‌లు ఇళ్ల స్థలాల కోసం ల్యాండ్ కొన్నామని, ఓనర్ నుంచి ఇతను అగ్రిమెంట్ చేసుకున్నట్లు చెప్పారు. 
 
అయితే దానిని మార్కెట్ ధర కంటే ఎక్కువ చెల్లించి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు, యూనియన్ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను పలు దఫాలుగా రూ.6 కోట్ల 50 లక్షల వరకు యూనియన్ అనుమతి లేకుండా అనధికారికంగా బ్యాంకు అధికారుల ప్రమేయంతో కాజేశారనే ఆధారాలతో అప్పటి అధ్యక్షుడు సెక్రటరీ ట్రెజరర్‌పై కేసు నమోదు చేయగా, దర్యాప్తు జరుగుతోంది. 
 
ఈ క్రమంలోనే ఆగస్టులో జరిగిన తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో దొరై ప్యానల్ మీద అమ్మిరాజు ప్యానెల్ ఘన విజయం సాధించింది. యూనియన్ అధ్యక్షుడిగా అమ్మిరాజు కానుమిల్లి ఎంపికయ్యారు. గత కార్యవర్గంలో జరిగిన భూముల కొనుగోలు, నగదు బదాలాయింపులపై, పాత కార్యవర్గం సభ్యులను పిలిచి కొత్త కార్యవర్గం  వివరణ కోరగా మరోమారు సభ్యుల‌ మధ్య మాటా మాటా పెరిగి దాడి చేసుకునేంత వరకు పరిస్థితి దారితీసినట్లు.. యూనియన్‌లోని సీనియర్ సభ్యులపై పాత కార్యవర్గ సభ్యులు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది..!! 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెమెరామెన్ లను ఎంకరేజ్ చేసిన ఎన్టీఆర్ - లేటెస్ట్ అప్ డేట్