తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కీలక నిర్ణయం తీసుకుంది. నానాటికీ పెరిగిపోతున్న చిత్ర నిర్మాణ వ్యయం, నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
2017 డిసెంబరు 8వ తేదీన జరిగిన మండలి అత్యవసర సమావేశంలో సంక్రాంతి, దసరా పండుగలకు నేరుగా తెలుగులో వచ్చిన సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ ఆదివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు గతంలో మాట్లాడుతూ, తెలుగు ఉండగా డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎలా ఇస్తా అంటూ గత 2019లో చేసిన ఘాటు వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. ఆ ప్రకారమే తెలుగు సినిమాలకు ప్రథమ ప్రాధాన్యత ిస్తూ మిగిలిన థియేటర్లను డబ్బింగ్ సినిమాలకు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.