Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆమె వ్యభిచారి.... నా చావుకు భార్యే కారణం : కమెడియన్ విజయ్

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. తన ఆత్మహత్యకు ముందు విజయ్ సెల్ఫీ వీడియో తీశాడు.

ఆమె వ్యభిచారి.... నా చావుకు భార్యే కారణం : కమెడియన్ విజయ్
, సోమవారం, 11 డిశెంబరు 2017 (16:28 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. తన ఆత్మహత్యకు ముందు విజయ్ సెల్ఫీ వీడియో తీశాడు. ఇందులో తన భార్యతో పాటు మరో ఇద్దరు వ్యక్తుల వేధింపుల వల్లే సూసైడ్ చేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు. పైగా, రూ.3 కోట్లు ఇవ్వాలని బెదిరించారనీ, తన వద్ద ఉన్న కారు, బంగారు వస్తువులను ఈ ముగ్గురు బెదిరించి తీసుకెళ్లారంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం పోలీసులు చేతికి చిక్కింది. దీంతో విజయ్ ఆత్మహత్యకు భార్యే కారణమని ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. 
 
'బొమ్మరిల్లు', 'అమ్మాయిలు - అబ్బాయిలు' వంటి కొన్ని సినిమాలలో నటించిన నటుడు విజయ్ సాయి ఆత్మహత్య చేసుకొన్నాడు. సినిమాలలో అవకాశాలు లభించకపోవడంతో తీవ్ర నిరాశా నిస్పృహలలో కొట్టుమిట్టాడుతున్న విజయ్ సాయి ఆదివారం రాత్రి యూసఫ్ గూడాలో తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఈ సెల్ఫీ వీడియో బయటకొచ్చింది. మూడు సంవత్సరాల నుంచి తన భార్య వనిత నుంచి తాను విడిగా ఉంటున్నానని... తాను యూసుఫ్ గూడలో ఉంటుండగా, తన భార్య మణికొండలో ఉంటోందని విజయ్ చెప్పాడు. కొంత కాలం క్రితమే విడాకుల కోసం తన భార్య కోర్టులో పిటిషన్ వేసిందని, భరణం కూడా కోరిందని తెలిపాడు. ఈ రెండు కేసుల నుంచి బయటపడాలంటే భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిందని చెప్పాడు. రూ.3 కోట్ల వరకు డిమాండ్ చేసిందని తెలిపాడు. ఈ వ్యవహారానికి సంబంధించి శశిధర్ అనే వ్యక్తితో పాటు అడ్వొకేట్లు వేధింపులకు పాల్పడ్డారని చెప్పాడు. రెండు రోజుల క్రితం తన ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు, కారును కూడా తీసుకెళ్లారని... ఈ క్షోభను తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని వీడియోలో చెప్పాడు.
 
తన చావుకు భార్య వనితనే కారణమని స్పష్టం చేశారు. 'వాల్ పోస్టర్' సినిమా షూటింగ్‌లో వనిత తనకు పరిచయం అయిందన్నారు. పెళ్లి అయిన తర్వాత వనిత నిజస్వరూపం తెలిసిందన్నారు. వ్యాపార అవసరాల నిమిత్తం.. తన భార్యను కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉపయోగించుకున్నారని వెల్లడించారు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి తనకు, వనితకు అనేకసార్లు గొడవలు అయ్యాయని చెప్పారు. చివరకు తన కూతురు కుందనను కూడా చూడనివ్వలేదని పేర్కొన్నారు. 
 
వనితకు గతంలోనే అమ్మిరెడ్డి అనే వ్యక్తితో పెళ్లి అయిందన్నారు. తన భార్య, ఆమె తల్లి వ్యభిచారం చేసేవారని వారి సొంతూరుకు వెళ్తే తెలిసిందని విజయ్ వీడియోలో పేర్కొన్నారు. ఇలాంటి వారి వల్ల సమాజం చాలా ఇబ్బంది పడుతుంది. వనితలాంటి వారిని వదలొద్దు. డాడీ.. ఎవ్వరిని విడిచిపెట్టొద్దు.. నిద్ర పట్టడం లేదు. అందరికీ శిక్ష పడేలా చూడు.. లవ్ యూ డాడీ.. కుందన అలాంటి వాతావరణంలో పెరగడం ఇష్టం లేదు.. తీసుకొని రండి డాడీ.. ప్లీజ్ డాడీ.. అంటూ విజయ్ సెల్ఫీ వీడియోలో స్పష్టంచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చింత చచ్చినా పులుసు చావలేదు.. చుక్కల్లో రవితేజ రెమ్యునరేషన్