మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. నా పేరు సూర్య తర్వాత బన్ని చాలా కథలు విన్న తర్వాత ఓకే చేసిన సబ్జెక్ట్ ఇది. ఆ రెండు హిట్ సినిమాలు కాగా ఈసారి హ్యాట్రిక్ హిట్ కోసం చూస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా ఫాదర్ సెంటిమెంట్‌తో వస్తుందని తెలుస్తోంది.
బన్ని తల్లి పాత్రలో అందాల తార టబు నటిస్తుందని తెలుస్తోంది. తెలుగులో టాప్ హీరోయిన్‌గా చెలామణి అయిన టబు ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ ఆమెకు మంచి క్రేజ్ వుంది.
కానీ కొన్నేళ్ల పాటు తెలుగు తెరకు దూరంగా వున్న ఈ భామ మళ్లీ అమ్మగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే నదియా, ఖుష్బూలకు కీలక రోల్స్ ఇచ్చిన త్రివిక్రమ్ టబు కూడా బన్నీతో చేసే సినిమాలో మదర్ పాత్ర ఇవ్వనున్నాడు. నగ్మా, నదియా కాదని చెప్పిన ఆ రోల్ కు టబు ఓకే చేసిందని తెలుస్తుంది.