Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళపై మూడేళ్ళ పాటు అత్యాచారం.. చిక్కుల్లో టి సిరీస్ ఎండీ

మహిళపై మూడేళ్ళ పాటు అత్యాచారం.. చిక్కుల్లో టి సిరీస్ ఎండీ
, శుక్రవారం, 16 జులై 2021 (18:13 IST)
ఓ మహిళపై మూడేళ్ళపాటు అత్యాచారం చేసిన కేసులో ప్రముఖ ఆడియో సంస్థ టి సిరీస్ మ్యూజిక్ కంపెనీ అధినేత, నిర్మాత భూషణ్ కుమార్‌ చిక్కుల్లో పడ్డారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ముంబై పోలీసులు ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదు. 
 
తనను భూషణ్ కుమార్ 2017 నుంచి 2020 వరకు భూషణ్ కుమార్ (43) తనపై  వివిధ ప్రదేశాల్లో అత్యాచారం చేశాడని బాధితురాలు (30) ముంబైలోని డీఎన్ నగర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది.
 
2017లో తన అప్ కమింగ్ ప్రాజెక్టుల్లో ఒక దాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని  చెప్పి మూడేళ్ళపాటు భూషణ్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. మూడేళ్లలో భూషణ్ తనపై అత్యాచారం చేసిన ప్రదేశాలను బాధితురాలు తన ఫిర్యాదులో వివరించింది. 
 
మూడేళ్లవుతున్నా తనకు అవకాశం ఇవ్వలేదని అడిగితే తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడని ఆమె తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు భూషణ్ కుమార్‌పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు. భూషణ్ కుమార్‌ను పోలీసులు విచారించాల్సి ఉంది.
 
కాగా, 1997లో తన తండ్రి గుల్షన్ కుమార్ హత్యానంతరం భూషణ్ కుమార్ టీ సిరీస్ బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆయన వయస్సు 19 సంవత్సరాలు. 2001లో తుమ్ బిన్‌తో చిత్రనిర్మాణంలోకి అడుగుపెట్టి పలు విజయవంతైన చిత్రాలు నిర్మించాడు. భూషణ్ కుమార్ 2005 పిబ్రవరి 13న నటి దివ్యా ఖోస్లాను వివాహం చేసుకున్నారు. వీరికిరూహన్ కుమార్ అనే కొడుకు ఉన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ్యాస్ట్రోలో 'బేబీ ఓ బేబీ' సాంగ్ విడుద‌ల‌