Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ యేడాది వేసవిలో వరుస చిత్రాల రిలీజ్.. టాలీవుడ్ క్యాచ్ చేసుకున్నట్టేనా?

Advertiesment
kingdom

ఠాగూర్

, గురువారం, 13 ఫిబ్రవరి 2025 (16:15 IST)
తెలుగు చిత్రపరిశ్రమ గత యేడాది సమ్మర్ సీజన్‌ను పూర్తిగా మిస్ చేసుకుంది. అగ్రహీరోల సినిమాల విడుదల తేదీల్లో గందరగోళం నెలకొంది. దీంతో చిన్నబడ్జెట్ చిత్రాల నిర్మాతలు తమ చిత్రాలను విడుదల చేసేందుకు సాహసం చేయలేక పోయారు. కానీ, ఈ యేడాది మాత్రం రెండు నెలలకు ముందుగానే రిలీజ్ డేట్స్‌ను అనేక చిత్రాలు లాక్ చేశాయి. మార్చి నెలాఖరు మొదలు మే నెల చివరి వరకు దాదాపు పది పెద్ద చిత్రాలు విడుదలకానున్నాయి. మార్చి చివరి వారంలో రాబిన్ హుడ్ 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలు వస్తున్నాయి. 
 
ఏప్రిల్ మొదటివారంలో "భైరవం", ఏప్రిల్ 10న సిద్ధు జొన్నలగడ్డ సినిమా కోసం లాక్ అయింది. ఏప్రిల్ 18వ తేదీన అనుష్క నటించి "ఘాటి" చిత్రం విడుదలకానుంది. ఏప్రిల్ 25వ తేదీన "కన్నప్ప" చిత్రం విడుదలకానుంది. అలాగే, ఏప్రిల్ ఒకటో తేదీన నాని ''హిట్-''3 మూవీ రిలీజ్ చేయనున్నారు. మే 9న రవితేజ "మాస్ జాతర", మే 30వ తేదీన విజయ్ దేవరకొండ "కింగ్‌డమ్" చిత్రం విడుదలకానుంది. సో.... ఈ యేడాది సమ్మర్ సీజన్‌ను టాలీవుడ్ పూర్తిగా ఉపయోగించుకునేందుకు ముందుగానే సిద్ధమైపోయింది. మరి ప్రేక్షకులు ఏయే చిత్రాలను ఆదరిస్తారో వేచిచూడాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ బాహుబలితో అనుపమ్ ఖేర్ - తన 544వ చిత్రమంటూ...