అమెరికాలో రజినీకాంత్... గ్యాంబ్లింగ్ ఆటలో నిమగ్నం.. ఆయనో 420 అంటూ స్వామి ట్వీట్
తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ అమెరికాకు వెళ్లారు. ఆరోగ్య వైద్య పరీక్షల నిమిత్తం ఆయన యూఎస్‌కు వెళ్లారు. అయితే, అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారో లేదోగానీ... కాసినోలో గ్యాంబ్లింగ్ ఆడుతూ కెమెరా కంటికి చి
తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ అమెరికాకు వెళ్లారు. ఆరోగ్య వైద్య పరీక్షల నిమిత్తం ఆయన యూఎస్‌కు వెళ్లారు. అయితే, అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారో లేదోగానీ... కాసినోలో గ్యాంబ్లింగ్ ఆడుతూ కెమెరా కంటికి చిక్కాడు. అంతే... ఈ ఫోటో బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి చేతికి చిక్కింది.
ఇక ఈ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన స్వామి.. దానికి కింద ఓ కామెంట్ పెట్టారు. అతనో 420 అంటూ కామెంట్ చేశాడు. తన ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవడం కోసం ఆర్కే (రజనీకాంత్) 420 గ్యాంబ్లింగ్ ఆడుతున్నాడా? అతనికి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఈడీ విచారణ జరపాలి అని స్వామి డిమాండ్ చేశారు.
కాగా, రజనీ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ఊహాగానాలు మొదలైనప్పటి నుంచి స్వామి తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగానే తాజాగా రజనీకాంత్‌ను 420తో పోల్చారు. అయితే, తమిళనాడు సీఎం కావడానికి రజనీ ఏమాత్రం సరితూగడు అని స్వామి స్పష్టంచేశారు.