Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్టార్‌ మా లో హీట్‌ పెంచుతున్న మా డ్యాన్స్‌ ఫైనలిస్ట్‌లు

స్టార్‌ మా లో హీట్‌ పెంచుతున్న మా డ్యాన్స్‌ ఫైనలిస్ట్‌లు
, శనివారం, 22 మే 2021 (19:08 IST)
Star maa dancers
గత కొద్ది నెలలుగా స్టార్‌మాలో అత్యంత ఆసక్తిగా జరుగుతున్న స్టార్‌ మా డ్యాన్స్‌+ పోటీలు తుది అంకానికి చేరాయి. ఒకరిని మించిన ప్రదర్శన మరొకరు చేస్తూ వీక్షకులను బుల్లితెరలకు కట్టేసిన డ్యాన్స్‌ మాస్టర్లు తుది పోటీలో అంతకు మించిన ప్రదర్శనలివ్వడం ద్వారా టైటిల్‌ గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్‌ మా డ్యాన్స్‌+ ఫైనల్స్‌ మే 23వ తేదీన జరుగబోతున్నాయి. ఈ ఫైనల్స్‌లో పోటీపడుతున్న పోటీదారులంతా కూడా తమ సత్తా చాటుతామని, టైటిల్‌ తమదే అంటూ విశ్వాసంతో చెబుతున్నారు.

ఈ శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే డ్యాన్స్‌+ఫైనల్‌ పోటీతో పాటుగా  ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే గ్రాండ్‌ ఫినాలే వీక్షించడం ద్వారా 20 లక్షల రూపాయల బహుమతి తో పాటుగా  విజేతగా నిలిచేది ఎవరో తెలియనుంది. గత 21 వారాలుగా స్టార్‌ మాలో డ్యాన్స్‌+కార్యక్రమంలో ఉత్సాహపరిచే నృత్యాలతో వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి ఫైనల్స్‌కు చేరిన ఐదు టీమ్‌ల ప్రతినిధులు తమ ప్రయాణంతో పాటుగా తాము నేర్చుకున్న అంశాలు, స్ఫూర్తిప్రదాతలను గురించి ఏం చెబుతున్నారో వారి మాటల్లోనే విందాం.
 
1.వాసి టోనీ (యశ్వంత్‌ మాస్టర్‌ టీమ్‌)
2. సంకేత్‌ సహదేవ్‌ (యశ్వంత్‌ మాస్టర్‌ టీమ్‌)
3.మహేశ్వరి – తేజస్విని (బాబా మాస్టర్‌ బృందం)
4.జియా ఠాకూర్‌ (అనీ మాస్టర్‌ బృందం)
5.డార్జిలింగ్‌ డెవిల్స్‌ (రఘు మాస్టర్‌ బృందం)
 
ఈ షో హోస్ట్‌ ఓంకార్‌ గారికి ముందుగా ధన్యవాదములు . భారత్‌ తరపున అంతర్జాతీయ వేదికలలో పాల్గొనాలనే నా లక్ష్యంకు ఓ దిశను అందించారాయన. ఈ డ్యాన్స్‌ షోలో పాల్గొనడం ద్వారా నూతన నృత్యరీతులు తెలుసుకునే అవకాశం నాకు కలిగింది. ఎందుకంటే ఈ డ్యాన్స్‌షో సాధారణతకు భిన్నంగా ఉండేది.

ఆ కారణం చేత అంతర్జాతీయ నృత్యరీతులను తెలుగు రియాల్టీ షోలో ప్రదర్శించే అవకాశం కలిగింది. అదే సమయంలో ప్రతిసారీ అత్యున్నత స్ధాయిలో ప్రదర్శన కోసం తపించేలా పోటీదారులు ఉండటంతో నూతన నృత్యరీతులను నేర్చుకునే అవకాశమూ ఈ షో అందించింది. ఈ షోలో తొలి రోజు నుంచి కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. కొంతమంది సభ్యులు గాయపడితే, మరికొంత మంది ఆరోగ్య సమస్యలతో తప్పుకున్నారు. అయినా మా మాస్టర్‌ ఆశను వదులుకోలేదు. మాకు ఆత్మవిశ్వాసం కలిగిస్తూ అద్భుతమైన ప్రదర్శనలు చేసేందుకు తోడ్పడ్డారు.
 
ఈ షో తరువాత ఏమిటీ అని అంటే, జాతీయ షోలలో పాల్గొనాలనేది ఆలోచన. మాకెవరికీ పెద్దగా బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. ప్రొఫెషనల్‌గా ఎదిగేందుకు డ్యాన్స్‌+ షో మాకు ఎంతగానో తోడ్పడింది. 
మేము ఈ స్థాయికి వచ్చామంటే రఘు మాస్టర్‌ కృషి ఎంతో ఉంది. తొలి నుంచి ఆయన మాతో ఉన్నారు. ఆయనకున్న బిజీ షెడ్యూల్స్‌లో కూడా ఆయన మాకోసం సమయం కేటాయించడం ఎన్నటికీ మరిచిపోము. అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు సరసన జాన్వీ నటిస్తుందా? త్రివిక్రమ్ ఏం చేస్తారో?