Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దూకుడు పెంచిన జక్కన్న.. 'ట్రిపుల్ ఆర్‌'కు లొకేషన్ల ఎంపికలో రాజమౌళి

ఎస్.ఎస్.రాజమౌళి దూకుడు పెంచాడు. 'బాహుబలి' తర్వాత ఆయన మరో ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టును 'ట్రిపుల్ ఆర్' పేరుతో నిర్మిస్తున్నారు. 'రాజమౌళి - రామారావు - రామ్ చరణ్'ల పేరులోని మొదటి ఇంగ్లీషు అక్షరం

Advertiesment
దూకుడు పెంచిన జక్కన్న.. 'ట్రిపుల్ ఆర్‌'కు లొకేషన్ల ఎంపికలో రాజమౌళి
, సోమవారం, 6 ఆగస్టు 2018 (13:21 IST)
ఎస్.ఎస్.రాజమౌళి దూకుడు పెంచాడు. 'బాహుబలి' తర్వాత ఆయన మరో ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టును 'ట్రిపుల్ ఆర్' పేరుతో నిర్మిస్తున్నారు. 'రాజమౌళి - రామారావు - రామ్ చరణ్'ల పేరులోని మొదటి ఇంగ్లీషు అక్షరం వచ్చేలా ట్రిపుల్ ఆర్‌తో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ మూవీని రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కూడా బాహుబలి రేంజ్‌లో ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
 
అయితే, ఈ ప్రాజెక్టు ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అదేసమయంలో ఈ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోని అల్యూమినియం ప్లాంట్‌లో భారీ సెట్ నిర్మాణం కూడా జరుగుతోందట. నిజానికి పక్కా బైండ్ స్క్రిప్ట్ చేతిలో లేకుండా రాజమౌళి గ్రౌండ్‌వర్క్‌కు దిగరు. ఈ స్క్రిప్ట్ ప్రకారమే ఆయన లొకేషన్స్ ఎంపిక చేసుకుని, సెట్స్ వేసుకుని పక్కా ప్లాన్‌తో ముందుకుసాగుతారు. 
 
ఇపుడు ఆ ప్రకారంగానే ఆయన ముందుకు సాగుతున్నారు. అయితే, ఇకపై మరింత దూకుడుంగా వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. బ్రిటిష్ కాలానికి సంబంధించిన కథ కావడంతో హైదరాబాద్ సమీపంలో ఉన్న కొల్లూరు గ్రామం పరిసర ప్రాంతాలను సెట్ నిర్మాణం కోసం పరిశీలిస్తున్నట్టు సమాచారం.  
 
అలాగే, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు.. బ్రిటీష్ పాలకులు అధికంగా నివశించిన ప్రాంతాల ఎంపికలో ఈ జకన్న నిమగ్నమైవున్నట్టు సమాచారం. మొత్తంమీద రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టిసారించి దూకుడు పెంచాడని చెప్పొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతనితో అలా పిలిపించుకోవడం చాలా ఇష్టంగా ఉంది : కత్రినా కైఫ్