Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హాస్యభరిత చిత్రం... "జయమ్ము నిశ్చయమ్మురా.."

"గీతాంజలి" తర్వాత శ్రీనివాస్ రెడ్డి "రాజు గారి గది" తర్వాత పూర్ణ జంటగా నటిస్తున్న నేటివిటీ హాస్యభరిత చిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా". తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రంలో ఉన్న రోజుల్ని గుర్తుకు తెస్తూ... 2013

Advertiesment
srinivas reddy
, బుధవారం, 14 సెప్టెంబరు 2016 (16:26 IST)
"గీతాంజలి" తర్వాత శ్రీనివాస్ రెడ్డి "రాజు గారి గది" తర్వాత పూర్ణ జంటగా నటిస్తున్న నేటివిటీ హాస్యభరిత చిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా". తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రంలో ఉన్న రోజుల్ని గుర్తుకు తెస్తూ... 2013 నేపథ్యంలో - కరీంనగర్ నుంచి కాకినాడ వెళ్లిన ఓ యువకుడి చుట్టూ సాగే సరదా కథే "జయమ్ము నిశ్చయమ్మురా". 
 
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోందని చిత్ర నిర్మాత - దర్శకుడు శివరాజ్ కనుమూరి తెలిపారు. చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు మాట్లాడుతూ... "కరీంనగర్, పోచంపల్లి, కాకినాడ, వైజాగ్, భీమిలి మొదలగు లొకేషన్స్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకొందని, ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని" అన్నారు. 
 
ఈ చిత్రానికి సంగీతం: రవిచంద్ర, కెమెరా: నాగేష్ బన్నేల్, ఎడిటింగ్: ఎడిటర్ వెంకట్, సహ నిర్మాత: సతీష్ కనుమూరి, నిర్మాణం-దర్శకత్వం: శివరాజ్ కనుమూరి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23న ఎరోటిక్ సస్పెన్స్‌ థ్రిల్లర్ 'రెడ్'