ప్రముఖ యాంకర్ సుమ కనకాల వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న స్టార్ట్ మ్యూజిక్ షోకు శ్రీముఖి, విష్ణు ప్రియ, ఆర్జే చైతూ, పండు, రోల్ రైడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. అందులో ఏ సెలబ్రిటీ అంటే ఇష్టమనగా.. చిరంజీవిగారంటే ఇష్టమని శ్రీముఖి చెప్పింది.
ఇక ఎవరితో రొమాంటిక్ డేట్‌కి వెళ్తావు అని సుమ ప్రశ్నించగా.. ఎవ్వరితో వెళ్లను. ఎందుకంటే ఇప్పుడు నేను కమిటెడ్. ఈ షో నా బాయ్‌ఫ్రెండ్ చూస్తుంటాడు అని చెప్పింది. ఇక పండును ఉద్దేశించి లిమిట్స్ క్రాస్ చేయకు అంటూ వార్నింగ్ ఇచ్చింది శ్రీముఖి.
అయితే ఆ మధ్యన ఓ షోలో నువ్వు అమ్మాయి గెటప్ వేయకపోయి ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని అంటూ పండు గురించి శ్రీముఖి చెప్పింది. వారిద్దరి రొమాంటిక్ ఎపిసోడ్‌లు అప్పుడు వైరల్‌గా మారాయి. అయితే ఇప్పుడు పండుకు శ్రీముఖి వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
ఇదిలా ఉంటే గతంలో శ్రీముఖి ఒకసారి ప్రేమలో పడింది. ఈ విషయాన్ని బిగ్‌బాస్ 3లో వెల్లడించింది. తాను ఒక వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో పడ్డానని.. అతన్నే పెళ్లి కూడా చేసుకోవాలని కలలు కన్నానని.. కానీ చివరి నిమిషంలో తను మోసం చేసాడని అప్పట్లో చెప్పింది. అతడికి పెళ్లైపోయిందనే విషయాన్ని దాచేసి.. తన దగ్గర ప్రేమ నాటకం ఆడాడని.. దాంతో తట్టుకోలేక చాలా రోజుల పాటు బయటికి కూడా రాలేకపోయానని అప్పట్లో శ్రీముఖి వెల్లడించింది.