Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

Advertiesment
sonudi production

ఠాగూర్

, ఆదివారం, 2 మార్చి 2025 (16:46 IST)
ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా నటిస్తున్న చిత్రం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ క్లాప్ కొట్టగా తొలి షాట్‌ను దేవుని పటాలపై చిత్రీకరణ జరిగింది. దర్శకులు వీరశంకర్, నవీన్ ఎర్నేని, తనికెళ్ల భరణి చిత్ర దర్శక ద్వయం కిట్టి కిరణ్, లక్ష్మీ చైతన్యలకు స్క్రిప్ట్‌ను అందించారు. ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ టి, వంశీ కెమెరా స్విచ్చాన్ చేశారు. 
 
సినిమా ఓపెనింగ్ తర్వాత విలేకరుల సమావేశంలో నిర్మాత ఆర్ యు రెడ్డి మాట్లాడుతూ, మా బ్యానర్ నుండి వస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకులతో మంచి కథతో సినిమా షూటింగ్‌ను మార్చి 6 నుండి తొలి షెడ్యూల్‌ను ఊటిలో ప్లాన్ చేశాం. తొలి షెడ్యూల్ తర్వాత రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేశాం. మా సోనుది నుండి ఏడాదికి కొన్ని సినిమాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సమాజం మాకు అండగా ఉండి ఎంతో ఇచ్చింది. మా వంతుగా మేము కూడా సమాజానికి మేలు చేసే మంచి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. 
 
మా నటీనటులు, టెక్నీషియన్స్‌కి అభినందనలు అన్నారు. హీరోయిన్ మానస మాట్లాడుతూ ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్. డైరెక్టర్స్ చాలా టాలెంట్ ఉన్నవారు అన్నారు. దర్శకులు కిట్టి కిరణ్, లక్ష్మీ చైతన్యలు మాట్లాడుతూ, మా టాలెంట్‌ను నిరూపించుకునే అవకాశం కల్పించిన నిర్మాత ఆర్ యు రెడ్డికి కృతజ్ఞతలు. సినిమాను గొప్పగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, సంధ్య జానక్, కెమెరా మెన్ జోషి తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం