Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోనూసూద్‌ను వదలట్లేదు.. జాగ్రత్త.. హనుమ విహారి ట్యాగ్ ఎందుకని..?

Advertiesment
సోనూసూద్‌ను వదలట్లేదు.. జాగ్రత్త.. హనుమ విహారి ట్యాగ్ ఎందుకని..?
, సోమవారం, 17 మే 2021 (19:53 IST)
Sonu Sood
ప్రజలంతా దేవుడిగా భావించే మానవతా వాది సోనూసూద్‌ని కేటుగాళ్లు వదల్లేదు. ఆయన పేరుతో డబ్బు వసూళ్లకు దిగారు. ఈ విషయాన్ని స్వయంగా సోనూసూదే తెలియజేశాడు.
 
ఆపదలో ఉన్నామంటూ అడిగిన వారందరికీ చేతిలో ఎముక లేదన్నట్లుగా సాయం చేస్తూ కరోనా సమయంలో ఎంతోమందికి దేవుడిగా మారారు రియల్ హీరో సోనూసూద్‌.

అలాంటి సోనూసూద్‌ పేరును వాడుకొని కొంతమంది అత్యాశతో అతి తెలివి ఉపయోగించి డబ్బు వసూళ్లకు తెరతీశారు. దీనిపై సోనూ ట్విటర్‌ వేదికగా స్పందించారు. 'వార్నింగ్‌'.. ఫేక్‌ ఫౌండేషన్‌ అంటూ ఒక పోస్టును ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. 
 
మరోవైపు కోవిడ్ బాధితుల సేవలో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి తనదైన పాత్ర పోషిస్తున్నారు. ట్విట్టర్ ద్వారా అవసరమైన సమాచారం అందిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన చేసిన ట్వీట్‌కు రాష్ట్ర మంత్రి గౌతమ్ రెడ్డి స్పందించారు.
 
వివరాల్లోకి వెళితే.. విశాఖపట్టణానికి చెందిన ఎన్. వరలక్ష్మి అనే పేషంట్ కంటి సమస్యతో బాధపడుతోంది. కోవిడ్ పేషంట్ అయిన ఆమెను నగరంలోని ఎన్ఆఐ ఆసుపత్రిలో పరీక్షించిన డాక్టర్ అత్యవసర వైద్య సేవలు అందించాలని సూచించారు.
 
ఈ విషయం హనుమ విహారికి తెలియడంతో.. ఆయన ట్వీట్ చేస్తూ... ఈమెకు సాయంత్రం నాలుగులోపు వైద్యం అందకపోతే చూపు కోల్పోతుందని ... సాయం చేయాలంటూ సోనుసూద్‌ను ట్యాగ్ చేశాడు.
 
ఈ ట్వీట్‌కు రాష్ట్ర ఐటీ మంత్రి గౌతమ్ రెడ్డి స్పందిస్తూ... తనకు వ్యక్తిగతంగా మెసేజ్ చేయమని కోరారు. వెంటనే స్పందించిన హనుమ... ఆ వివరాలను ఆయనకు అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఏంటదో తెలుసా?