ప్రసిద్ధ గాయకుల్లో సోనూ నిగమ్ ఒకరు. ఇటీవలే సింగర్ అర్జిత్ సింగ్కు పద్మ శ్రీ అవార్డ్ రావడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో విమర్శకులకు గురైయ్యాడు. తాజాగా సోనూ నిగమ్ ఆసుపత్రిలో చేరారు. వెన్నునొప్పి తీవ్రంగా బాధించినప్పటికీ అతడు తన ప్రదర్శనను కొనసాగించాడు. నొప్పి మరింత తీవ్రం కావడంతో సంగీత కచేరి అనంతరం ఆసుపత్రిలో చేరారు.
ఈ సందర్భంగా సోనూ మాట్లాడుతూ.. "నా జీవితంలో కష్టతరమైన రోజు. నేను పాటలు పాడుతూ వేదిక చుట్టూ తిరుగుతున్నాను. అప్పుడు నొప్పి వచ్చింది. కానీ ఎలాగోలా మేనేజ్ చేశారు. వెన్నులో చాలా నొప్పిగా ఉంది. నా వీపులో ఎవరో ఇంజక్షన్ సూది వేసినట్లు అనిపించింది." అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు. సోనూ నిగమ్ వీడియోలో అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.