Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సింగర్ సునీత రెండో పెళ్లి.. ఇంటర్వ్యూల్లో కన్నీళ్లు పెట్టుకుంది.. ఎందుకంటే? (video)

Advertiesment
Sunitha
, శనివారం, 17 సెప్టెంబరు 2022 (20:26 IST)
టాలీవుడ్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సింగర్ సునీత రెండో పెళ్లి మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యాక తొలి భర్త బాధలు భరించలేక విడాకులు ఇచ్చేసింది. సింగిల్ మదర్‌గా ఉంటూ ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. కాగా ప్రతి మనిషికి జీవితంలో ఒక తోడు అంటూ అవసరం అంటూ ఆమె బిడ్డలు ఆమె కోసం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని ఇచ్చి రెండో వివాహం చేశారు.
 
మనకు తెలిసిందే సింగర్ సునీత రామ్ జంటపై చాలా ట్రోలింగ్ జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఇదే ప్రశ్న సునితను అడిగాగ్గా.." మీ మీద చాలా ట్రోస్ వస్తున్నాయి కదా .. మీరు రెండో పెళ్లి గురించి అయితే చాలా విమర్శలు ఉన్నాయి ..చాలా ట్రోలింగ్ కూడా జరుగుతుంది ..వాటి గురించి మీరు ఏమంటారు ..ఎప్పుడైనా బాధపడ్డారా..? అని ప్రశ్నించగా" సునీత మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయింది. 
webdunia

\


sunitha
 
ఆమె మాట్లాడుతూ .."మీరందరూ అంటూ ఉంటారు కదా చిత్ర గారి తర్వాత సునీత 121 మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిందని.. చాలామందిని ఎంటర్ టైన్ చేసింది అని.. మరి అలాంటి మంచి విషయాలు గురించి మీరు నన్ను పొగిడినప్పుడు రామ్‌ని పెళ్లి చేసుకున్నందుకు నన్ను ఎందుకు తిడుతున్నారు. 
 
నాపై ఎందుకు ట్రోల్ చేస్తున్నారు. అసలు నా పర్సనల్ లైఫ్‌తో మీకు ఏంటి సంబంధం. నా పర్సనల్ జీవితంపై ఎందుకు ఫోకస్ పెడుతున్నారు . ఎందుకు నా పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో గొంతు లేపుతున్నారు. 
webdunia


సంస్కారవంతుల లక్షణం ఏంటో తెలుసా.. ఒక మనిషి ఒక మాటను అనే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి.. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడితే మంచిది" అంటూ కన్నీరు పెట్టుకునేసింది. దీంతో ప్రస్తుతం సునీత మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణ వ్రింద విహారి హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ : దర్శకుడు అనీష్‌ ఆర్‌ కృష్ణ