Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీకు పిచ్చి... నీ మొగుడు రాజీవ్‌కు పిచ్చి... యాంకర్ సుమపై రెచ్చిపోయిన మహిళ

మార్చి 31న ప్రసారమైన జబర్దస్త్ షో.. అందులో నాగబాబు, రోజాలు ప్రేక్షకులను, సుడిగాలి సుధీర్ టీమ్‌ను ఏప్రిల్ ఫూల్ చేసేందుకు చేసిన రభస జనాలు మరిచిపోక ముందే స్టార్ మహిళ రూపంలో మరో వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రచ్చబండ అయినా, గడసరి అత్త సొగసరి కోడలు, ఢీ,

Advertiesment
shaking show
, మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (19:19 IST)
మార్చి 31న ప్రసారమైన జబర్దస్త్ షో.. అందులో నాగబాబు, రోజాలు ప్రేక్షకులను, సుడిగాలి సుధీర్ టీమ్‌ను ఏప్రిల్ ఫూల్ చేసేందుకు చేసిన రభస జనాలు మరిచిపోక ముందే స్టార్ మహిళ రూపంలో మరో వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రచ్చబండ అయినా, గడసరి అత్త సొగసరి కోడలు, ఢీ, జోడీ వంటి ఏ షో తీసుకున్నా ఏవీ లైవ్ షోలు కాదనే విషయం అందరికీ తెలిసిందే. 
 
ఏ స్కిట్ అయినా, డాన్స్ అయినా, జడ్జీలు, పాల్గొనేవారి మధ్య సంవాదాలు అయినా నేరుగా ప్రత్యక్ష ప్రసారం అయ్యే అవకాశం లేదు. వాటికీ కట్‌లు, రీటేక్‌లు, టచప్‌లు ఎలాగూ ఉంటాయి. కానీ టీఆర్పీల మోజులో పడిన టీవీ ప్రొడ్యూసర్లు, యాజమాన్యం జనాల్లో క్రేజ్‌ను సంపాదించుకునేందుకు, లేనిపోని వివాదాలు ఏవో సృష్టించి, వాటిని టెలికాస్ట్ చేసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి.
 
తాజాగా స్టార్ మహిళ కార్యక్రమంలో యాంకర్ సుమపై షోలో పాల్గొనేందుకు వచ్చిన ఓ మహిళ రెచ్చిపోయింది. తను చెప్పిన సమాధానమే రైట్ అని వాదనకు దిగిన ఆ మహిళ నీకేమైనా పిచ్చా అని సుమ అనడంతో మరింత రెచ్చిపోయిన ఆమె నీకు పిచ్చి, నీ మొగుడు రాజీవ్ కనకాలకు పిచ్చి అనే రేంజికి వెళ్లిపోయింది. పార్టిసిపెంట్ ఎలా ఉండాలో తెలుసుకోమని సుమ అంటే.. యాంకర్ ఎలా ఉండాలో నువ్ తెలుసుకో అని సుమకు గట్టి రిటార్ట్ ఇచ్చింది ఆమె. మాటకు మాట ఎదురయ్యేసరికి సహనం కోల్పోయిన సుమ గెటౌట్ ఆఫ్ మై షో అనేసింది.. కానీ ఈ మొత్తం వివాదానికి కారణమైన ఆ పార్టిసిపెంట్ చిరునవ్వులు చిందించడంతోనే ఈ ప్రోమో చూసేవారందరికీ డౌట్ వచ్చేసింది. ఇది మరో పబ్లిసిటీ స్టంటే ఏమోనని. 
 
అడల్ట్ కామెడీకి, ద్వందార్థాల సంభాషణలకు పాపులర్ అయిన జబర్దస్త్‌లో ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడుకున్నా, సుమ వంటి ఎంతో ప్రతిభాపాటవాలు ఉన్న యాంకర్‌కు సైతం ఈ వివాదాల పబ్లిసిటీ ఎందుకంటూ టీవీజనులు చర్చించుకుంటున్నారు. చూద్దాం.. త్వరలోనే ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఈ సస్పెన్స్‌కు తెరపడిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విడిపోయిన మరో బాలీవుడ్ జంట.. 16 యేళ్ల వివాహ బంధం తెగిపోయింది...