Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Thiruveer : మసూద తర్వాత సెలెక్టివ్‌గా కథల్ని ఎంచుకుంటున్నా: తిరువీర్

Advertiesment
Thiruveer

డీవీ

, గురువారం, 6 ఫిబ్రవరి 2025 (13:10 IST)
Thiruveer
జార్జ్ రెడ్డి, పలాస 1978 వంటి చిత్రాలలో తన దైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు తిరువీర్. ఆ తరువాత మసూద, పరేషన్ వంటి చిత్రాలలో ప్రధాన పాత్రలో ప్రేక్షకులను మరింతగా మెప్పించారు. ఇక తిరువీర్ కెరీర్‌లో మసూద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం తిరువీర్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.  ప్రస్తుతం తిరువీర్ 'ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో' అనే చిత్రంలో ఫోటోగ్రాఫర్ పాత్రలో కనిపించనున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఉండబోతోంది.
 
తిరువీర్ తన కొత్త చిత్రం గురించి మాట్లాడుతూ.. “వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పాత్రను పోషించడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మొబైల్‌తో చాలాసార్లు ఫోటోలు తీశాను. కానీ ఇలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా నటించడం చాలా కొత్తగా, ఛాలెంజింగ్‌గా అనిపిస్తోంది. స్టిల్స్ ఎలా పెట్టించాలి, కెమెరాను ఎలా పట్టుకోవాలి ఇలా చాలా విషయాల్ని నేర్చుకున్నాను. అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఈ చిత్రం ఉంటుంద’ని అన్నారు.
 
రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్ అరకులో జరిగింది. అక్కడి చలి తీవ్రతను తట్టుకుని మరి టీం అంతా ఎంతో కష్టపడి సినిమాను షూట్ చేశారు. ఈ సినిమాతో పాటుగా తిరువీర్ ‘భగవంతుడు’ అనే మరో ప్రాజెక్ట్‌ని కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకు సంబంధించిన షూటింగ్‌తో తిరువీర్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.
 
తిరువీర్ తన కొత్త సినిమాల గురించి మాట్లాడుతూ..‘మసూద తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాల్ని, కథల్ని ఎంచుకుంటున్నాను. నాకు సరిపోయే కథల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను స్టేజ్ ఆర్టిస్ట్‌ని కావడంతో ఆయా పాత్రలకు న్యాయం చేయగలుగుతున్నాను. దర్శకనిర్మాతలు నా కోసం పాత్రలు, కథలు రాస్తుండటం ఆనందంగా ఉంది. ఇదే ఓ నటుడికి గొప్ప విజయం’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రానా నాయుడు 2, టెస్ట్ తో అలరించేందుకు రెడీ అయిన నెట్ ఫ్లిక్స్