Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఖైదీ నెంబర్ 150'కి తర్వాత బోయపాటితో చిరంజీవి సినిమా.. గీతాఆర్ట్స్ బ్యానర్‌లో?

'ఖైదీ నెంబర్ 150' సినిమాకు తర్వాతి సినిమాకు మెగాస్టార్ చిరంజీవి రెడీ అయిపోయారు. ఇందుకు దర్శకుడు కూడా ఖాయమైపోయాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు.. సరైనోడు బోయపాటి. బోయపాటితో చేసేందుకు చిరంజీవి దాదాపుగా ఓకే చేశా

Advertiesment
'ఖైదీ నెంబర్ 150'కి తర్వాత బోయపాటితో చిరంజీవి సినిమా.. గీతాఆర్ట్స్ బ్యానర్‌లో?
, ఆదివారం, 20 నవంబరు 2016 (14:38 IST)
'ఖైదీ నెంబర్ 150' సినిమాకు తర్వాతి సినిమాకు మెగాస్టార్ చిరంజీవి రెడీ అయిపోయారు. ఇందుకు దర్శకుడు కూడా ఖాయమైపోయాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు.. సరైనోడు బోయపాటి. బోయపాటితో చేసేందుకు చిరంజీవి దాదాపుగా ఓకే చేశాడని, గీతాఆర్ట్స్ బ్యానర్‌లో దీన్ని తెరకెక్కించనున్నారట. అంతా ఓకే అయితే ఏప్రిల్‌లో పూజా కార్యక్రమాలు చేసి, మే నుంచి రెగ్యులర్‌గా షూటింగ్ ప్రారంభం కానుందని టాలీవుడ్ టాక్. 
 
ప్రస్తుతం ఈ సినిమా పనుల్లో బోయపాటి బిజీగా వున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ - బెల్లంకొండ ప్రాజెక్ట్ షూటింగ్ హైదరాబాద్ శివార్లలో చిత్రీకరణ జరుగుతోంది. కీలకమైన సీన్స్ కోసం యూనిట్ జనవరిలో బ్యాంకాక్ వెళ్లనుంది. 
 
మార్చిలోపు ఈ సినిమాను పూర్తి చేసుకుని చిరంజీవితో సినిమా ప్రారంభించాలని బోయపాటి భావిస్తున్నారట. ఈ సినిమా హీరోయిన్ కోసం వేట జరుగుతున్నట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్ను ఎదుర్కోవాలంటే ముగ్గురు ముసుగు దొంగలు సరిపోరు.. నేను చాలా స్ట్రాంగ్: మల్లికా షెరావత్