Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

నేను స్టూడెంట్ సార్ టైటిల్ సతీష్ పెడితే హీరోయిన్ ఎంపిక సురేష్ చేసారు ఎందుకంటే..

Advertiesment
Director Rakesh Uppalapathi
, శనివారం, 27 మే 2023 (18:08 IST)
Director Rakesh Uppalapathi
హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్' తో థ్రిల్  ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్‌ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్వీ 2 ఎంటర్‌ టైన్‌మెంట్‌ పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్ అంచనాలు పెంచాయి. జూన్ 2న నేను స్టూడెంట్ సార్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు రాకేష్‌ ఉప్పలపాటి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
మీ నేపథ్యం గురించి చెప్పండి ?
మాది భీమడోలు పక్కన యం.నాగులపల్లి. నాన్న గారు వ్యాపారం నిమిత్తం డైరెక్టర్ సుకుమార్ గారి వూరు పక్కన వున్న తాటిపాకకు మారాం. నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గోగినేని శ్రీనివాస్ గారి ప్రొడక్షన్ లో ‘చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’ అనే సినిమాకి పని చేశాను. అక్కడ ఆనంద్ అనే కోడైరెక్టర్ తేజ గారికి పరిచయం చేశారు. అప్పటి నుంచి అహింస స్క్రిప్ట్ వరకూ తేజ గారితోనే జర్నీ చేశాను.
 
‘నేను స్టూడెంట్ సార్' మీ సొంత కథ ?
ఈ చిత్రానికి కృష్ణ చైతన్య గారు కథ అందించారు. బెల్లంకొండ శ్రీనివాస్ గారి కోసం నేను ఒక కథ చెప్పాను. దాని మేకింగ్ వీడియో కూడా చేశాను. సతీష్ గారు, సురేష్ గారికి చాలా నచ్చింది. ఇదే సమయంలో గణేష్ కోసం ఓ కథ చుస్తున్నారు. కృష్ణ చైతన్య గారు చెప్పిన కథ వారికి నచ్చింది. అయితే అప్పటికే ఆయన నితిన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ కథని నేను బాగా తీయగలనని సతీష్ గారు, సురేష్ గారు భావించడంతో దర్శకుడిగా ప్రాజెక్ట్ లోకి వచ్చాను.  
 
‘నేను స్టూడెంట్ సార్’ కథ ఎలా వుంటుంది ?
ఇది థ్రిల్లర్. కథ గురించి ఏం చెప్పినా సస్పెన్స్ రివిల్ అయిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనకి ఇష్టమైన ఫోన్, అవసరమైన ఐడెంటిటీ.. భయపెట్టే గన్.. ఈ మూడింటి చుట్టూ కథ వుంటుంది. హీరోకి కమీషనర్ కి వార్ ఎలా వచ్చిందనేది చాలా ఆసక్తికరంగా వుంటుంది. ప్రతి ముఫ్ఫై నిమిషాలకు ఊహించని మలుపు వస్తుంది. సినిమా రెండు గంటల ఏడు నిమిషాలు వుంటుంది. ఇందులో మీరు ఎండ్ ని, విలన్ ని, కథ ఏ స్వరూపం లోకి వెళుతుందో అనేది ఊహించలేరు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
 
హీరోయిన్ ఛాయిస్ ఎవరిది ?
హీరోయిన్ విషయంలో చాలా ఆప్షన్లు వచ్చాయి. భాగ్యశ్రీ గారు హిందీ ఛత్రపతి లో శ్రీనివాస్ గారి మదర్ గా చేశారు. వాళ్ళ అమ్మాయిని తెలుగు  లో పరిచయం చేయాలనే ఆలోచన వుందని సురేష్ గారితో చెప్పారు.అలా అవంతిక ని చూశాం. ఈ పాత్రకు సరిపొతుందనిపించింది. భాగ్యశ్రీ గారి అమ్మాయి కావడంతో సినిమాకి కూడా హెల్ప్ అయ్యింది.
 
తేజ గారి నుంచి ఏం నేర్చుకున్నారు ?
తేజ గారు ఊటబావి లాంటి వ్యక్తి. ఆయన నుంచి నేర్చుకొని డైరెక్షన్ చేయాలంటే చేయలేం. ప్రతిరోజు కొత్తగా ఆలోచిస్తారు. కొత్త కోణంలో మాట్లాడతారు. ఆయన దగ్గర పూర్తిగా నేర్చుకున్నాను అని చెప్పలేను. కానీ చాలా నేర్చుకున్నాను.
 
ఈ సినిమా టైటిల్ ఆలోచన ఎవరిది ?
ఈ సినిమాకి మొదట రింగ్ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. ఐతే రింగ్ అంటే.. ఏ రింగ్  ? అనే ప్రశ్నలు వచ్చాయి. తర్వాత కొన్ని టైటిల్స్ పరిశీలించాం. సతీష్ గారు ఇందులో వున్న డైలాగ్ ప్రకారం .. ‘నేను స్టూడెంట్’ అన్నారు. దీనికి నేను ‘సార్’ అని యాడ్ చేశాను. నేను స్టూడెంట్ క్రెడిట్ ఆయనదే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెంచుకోవాలి : శ్రీలీల