'అర్జున్ రెడ్డి' చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగాకు రెబల్ స్టార్ ప్రభాస్ అవకాశం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ నటించే 25వ చిత్రానికి సందీప్ రెడ్డిని ఎంపిక చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
నిజానికి ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే చేతిలో నాలుగు సినిమాలు ఉండగా.. అందులో 'రాధేశ్యామ్' ఒక్కటే పూర్తయ్యింది. 'సలార్', 'ఆదిపురుష్' సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి.
మరికొద్దిరోజుల్లోనే నాగ్ అశ్విన్‌తో సినిమా ప్రారంభం కానుంది. ఇక ప్రభాస్ 25వ చిత్రానికి సంబంధించిన వివరాలను కూడా రేపు (అక్టోబర్ 7) వెల్లడించనున్నారు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన రాగా, దర్శకుడిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
తాజా సమాచారం మేరకు 'డార్లింగ్' ప్రభాస్ 25వ సినిమా అర్జున్ రెడ్డి దర్శకుడు ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌తో సినిమా చేయాలనీ ఎప్పటినుంచో అనుకుంటున్న సందీప్ వంగా.. కొత్త కథతో ప్రభాస్‌ను ఇంప్రెస్ చేశాడట. ప్రభాస్‌కు ఈ స్టోరీ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. టీ-సిరీస్ బ్యానరులో ఈ సినిమా రూపొందనుంది.