Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా తల్లి చెప్పిన మాటే ప్రత్యూష ఫౌండేషన్‌కు నాంది పలికింది : సమంత

గత 2012లో సంభవించిన ఘటన తన ఆలోచనలను మార్చివేసిందని సినీ నటి సమంత చెప్పుకొచ్చింది. మంచు లక్ష్మి ప్రసన్న వ్యాఖ్యాతగా ప్రముఖ టీవీ చానెల్ నిర్వహించే 'మేము సైతం' కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు.

Advertiesment
samantha
, ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (11:53 IST)
గత 2012లో సంభవించిన ఘటన తన ఆలోచనలను మార్చివేసిందని సినీ నటి సమంత చెప్పుకొచ్చింది. మంచు లక్ష్మి ప్రసన్న వ్యాఖ్యాతగా ప్రముఖ టీవీ చానెల్ నిర్వహించే 'మేము సైతం' కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను బాగా డబ్బున్న కుటుంబం నుంచి రాలేదని, కింది మధ్యతరగతి కుటుంబంలో ఉన్నప్పటికీ తన తల్లి పేదరికాన్ని ఏనాడూ సమస్యగా భావించలేదని చెప్పుకొచ్చింది. 
 
సినిమా హీరోయిన్ అయిన తర్వాత మూడేళ్లపాటు ఆఫర్లు వెల్లువెత్తడంతో, సంపాదనలో పడిపోయానని చెప్పింది. 2012లో తన జీవితంలో చోటుచేసుకున్న సంఘటనతో మూడు నెలలపాటు తీవ్ర నిరాశలో కూరుకుపోయానని తెలిపింది. అప్పుడు తానేం చేస్తున్నానని ఆలోచించానని, తాను జీవిస్తున్న విధానం సరైనదేనా అని అవలోకనం చేసుకున్నట్టు చెప్పింది. అప్పుడే తాను ఉన్నా లేకున్నా తన తల్లి చెప్పిన మాట మాత్రం బతకాలని భావించానని, అందుకే ప్రత్యూష ఫౌండేషన్‌ను ప్రారంభించానని, దాని ద్వారా చేతనైనంత సాయం చేస్తున్నానని సమంత తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతికి "ఖైదీ నంబర్ 150" విడుదల చేయాల్సిందే : రంగంలోకి దిగిన చిరంజీవి