Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మామ గారూ థ్యాంక్స్.. ముందు భయపడ్డాను.. సమంత అక్కినేని

Advertiesment
మామ గారూ థ్యాంక్స్.. ముందు భయపడ్డాను.. సమంత అక్కినేని
, గురువారం, 29 అక్టోబరు 2020 (17:29 IST)
Samantha Akkineni
బిగ్ బాస్ తాజా సీజన్ మంచి జోరుగా సాగుతోంది. ఇటీవల ఎలిమినేషన్ ప్రక్రియపై పలు విమర్శలు వ్యక్తమయినప్పటికీ.. ప్రోమోలతో వీక్షకులను ఆకర్షిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. అక్కినేని నాగార్జున అందుబాటులో లేకపోవడంతో బిగ్ బాస్‌ని సమంత హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆమెకు మంచి మార్కుల కూడా వేశారు వీక్షకులు. తాజాగా బిగ్ బాస్‌ హోస్ట్ చేయటంపై సమంత కామెంట్‌ చేశారు. నాగార్జున కోరితేనే షో చేశానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
 
గతంలో ఒక్క బిగ్‌ బాస్‌ ఎపిసోడ్ కూడా చూడలేదు. యాంకరింగ్ చేసిన అనుభవం కూడా లేదు. తెలుగు సరిగా మాట్లాడగలనో లేదో. అందుకే మామగారు బిగ్‌ బాస్‌ హోస్ట్ చేయమన్నప్పుడు భయపడ్డాను.

అవన్నీ పక్కన పెట్టి నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు థ్యాంక్యూ మామ. ఎపిసోడ్ టెలికాస్ట్ తరువాత నాకు అందుతున్న ప్రేమకు మీ అందరికీ కూడా థ్యాంక్స్‌ అని సమంత ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
ఇకపోతే... బిగ్ బాస్ హోస్ట్‌గా సమంత తనదైన వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకులు అందరితో కామెడీని పంచుతూ ఎంతగానో ఆకట్టుకుంది. లోపల ఉన్న హౌస్మేట్స్ కూడా సమంతను చూసి షాక్‌కి గురయ్యారు. ఇదిలా ఉంటే ఈ వారం బిగ్ బాస్ హోస్ట్‌గా ఎవరు రాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.
 
ప్రస్తుతం వైల్డ్ డాగ్ షూటింగ్‌లో భాగంగా విదేశాలకు వెళ్లినా కింగ్ నాగార్జున... బిగ్ బాస్ హోస్టింగ్ కోసం వస్తాడా.. లేదా ఈ వారం కూడా మళ్లీ అక్కినేని వారి కోడలు సమంత ఎంట్రీ ఇచ్చి అందరికీ ఫుల్ టైం ఎంటర్ టైన్మెంట్ పంచుతుందా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పునర్నవి కాబోయే భర్తను చూసారా? ఇడుగో ఇతడే