Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాబా సిద్ధిఖీ కాల్చివేత... సల్మాన్ ఖాన్ సికిందర్ చిత్రీకరణపై ఎఫెక్ట్!

salman khan

ఠాగూర్

, మంగళవారం, 22 అక్టోబరు 2024 (13:46 IST)
మహారాష్ట్ర ఇటీవల మాజీ మంత్రి సల్మాన్ ఖాన్‌ను గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులు కాల్చి చంపేశారు. దీంతో బాబా స్నేహితుడైన సల్మాన్ ఖాన్ తీవ్ర షాక్‌కు గురయ్యారు. సిద్ధిఖీ హత్య నుంచి ఆయన ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల ప్రభావం వలల్ల సికిందర్ చిత్రీకరణపై తీవ్ర ప్రభావం పండింది. 
 
"సికిందర్‌" యాక్షన్ సినిమా కావటంతో పాటు సల్మాన్‌పై ఔట్ డోర్‌లో ఎక్కువ శాతం సన్నివేశాల షూటింగ్ చెయాల్సి ఉంది. బాబా సిద్ధిఖీ ఆకస్మిక మరణం తర్వాత సల్మాన్ తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నాడు. ముఖ్యంగా సినిమా షూటింగులో పాల్గోనే శ్రద్ద సల్మాన్‌లో ఇప్పుడు ఏకోశానా కనిపించటం లేదు. 
 
సల్మాన్ అతని కుటుంబం యొక్క భద్రత అన్నింటికంటే ముఖ్యం కాబట్టి కొద్దిరోజులు బయటకు రావద్దనేది ముంబై పోలీసుల సలహా. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ తనకు మరోదారి లేదని అన్నీ కార్యక్రమాలు రద్దు చేసుకోవడమే ఉత్తమన్న నిర్ణయానికి వచ్చారు. మరోపక్క సల్మాన్ చిత్రీకరణకు ముందుకొచ్చినా.. అది తన తోటి నటీనటులకు టీమ్‌కు రిస్క్ అనే వాదన ఉంది. 
 
"సికిందర్" విషయానికి వస్తే..ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకుడు. రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాజిద్ నదియాడ్‌వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 ఈద్ సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. అయితే, సల్మాన్ ఇప్పుడు విరామం తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్న తరుణంలో, సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకాశంలో సూర్యచంద్రులు- ఆంధ్రలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ అంటున్నారు: Unstoppable బాలయ్య