Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్టోబర్ 16న సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' ట్రైలర్

Advertiesment
salmankhan tiger
, ఆదివారం, 8 అక్టోబరు 2023 (12:26 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన "టైగర్ 3" ట్రైలర్ రాబోతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కించిన 'టైగర్ 3' చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలోనే ట్రైలర్‌ను అక్టోబర్ 16న రిలీజ్ చేయబోతోన్నారు.
 
‘యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాలను ఆడియెన్స్ ఇప్పటికే చూసి విజయవంతం చేశారు. ఇప్పుడు టైగర్ 3తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. ఈ మూవీ చాలా ప్రత్యేకం’ అని సల్మాన్ ఖాన్ తెలిపారు.
 
టైగర్ 3 ట్రైలర్ కోసం సోషల్ మీడియాలో అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  మనీష్ శర్మ తెరకెక్కించిన ఈ మూవీని ఆదిత్య చోప్రా తమ స్పై యూనివర్స్‌‌లో భాగంగా అద్భుతంగా నిర్మించారు. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్‌లకు ఏ మాత్రం తగ్గకుండా టైగర్ 3ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్నారు.
 
‘టైగర్ 3 కథ ఎలా ఉండబోతోంది.. ఎలాంటి ట్విస్టులు ఉండబోతోన్నాయి.. ట్రైలర్ ఏ రేంజ్‌లో ఉంటుందన్న విషయాలు ప్రేక్షకుల ఊహకు అందవని.. గ్రిప్పింగ్‌గా కథ, కథనాలుంటాయి. టైగర్ 3 కథ విన్న వెంటనే నాకు నచ్చింది. ఇదే టైగర్ చేసే అత్యంత ప్రమాదకరమైన మిషన్ కానుంది’ అని సల్మాన్ ఖాన్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇతరుల బట్టలు విప్పడం ద్వారా డబ్బులు.. ఆ అర్హత రాజ్ కుంద్రాకు లేదు..?