Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగశౌర్యతో వివాదం.. వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తా: సాయిపల్లవి

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా రూపుదిద్దుకున్న ''కణం'' (తమిళంలో కరు) సినిమా మార్చి 9వ తేదీన రిలీజ్ కానుంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కే ఈ సినిమా భ్రూణ హత్య.. ఆ పిండం ఆత్మగా మారి తల్లిని చేరడమనే కాన్సెప్ట్

Advertiesment
నాగశౌర్యతో వివాదం.. వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తా: సాయిపల్లవి
, బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (14:27 IST)
నాగశౌర్య, సాయిపల్లవి జంటగా రూపుదిద్దుకున్న ''కణం'' (తమిళంలో కరు) సినిమా మార్చి 9వ తేదీన రిలీజ్ కానుంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కే ఈ సినిమా భ్రూణ హత్య.. ఆ పిండం ఆత్మగా మారి తల్లిని చేరడమనే కాన్సెప్ట్‌తో రానుంది. తల్లీకూతుళ్ల చుట్టూ తిరిగే ఈ సినిమాలో తల్లిగా సాయిపల్లవి నటిస్తోంది. ఆమె కుమార్తెగా వెరోనికా నటించారు. 
 
తల్లీబిడ్డల మధ్య గల అనుబంధానికి సంబంధించిన ఈ కథలో నటించడం ద్వారా.. అమ్మ అనే భావన ఎంత అందంగా ఉంటుందో తెలియవచ్చిందని సాయిపల్లవి అంది. తన కుమార్తెగా నటించిన వెరోనికను వదిలి తానుండలేకపోతున్నానని సాయిపల్లవి తెలిపింది. 
 
మరోవైపు సహచర హీరోలతో సాయిపల్లవి గొడవకు దిగుతుందని.. ఇటీవల నానితో కూడా సాయిపల్లవి గొడవపడిందని టాక్ వచ్చింది. తాజాగా నాగశౌర్యను కూడా సాయిపల్లవి ఇబ్బంది పెట్టందనే సమాచారం. సాయిపల్లవి ''కణం'' సినిమా షూటింగ్ సందర్భంగా సమయానికి రాకపోవడం వలన తాను చాలా ఇబ్బంది పడినట్లు నాగశౌర్య చెప్పడం వివాదస్పదమైంది. 
 
ఈ విషయంపై స్పందించిన సాయిపల్లవి నాగశౌర్య చేసిన కామెంట్స్ గురించి చదవగానే తాను ''కణం'' దర్శకుడికి ఫోన్ చేసి .. తన వలన ఎవరైనా ఇబ్బంది పడ్డారా? అని అడిగానని తెలిపారు. దర్శకుడు మాత్రం అలాంటిదేం లేదని చెప్పారని, తన వలన ఎవరైనా ఇబ్బంది పడితే అది అవతలవారికన్నా తనకే ఎక్కువ బాధ కలిగించే విషయమవుతుందని సాయిపల్లవి తెలిపింది. అయినా నాగశౌర్య వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తానని సాయిపల్లవి చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీదేవిని చివరిసారి చూడాలనీ.. క్యూ కట్టిన బాలీవుడ్ - టాలీవుడ్ - కోలీవుడ్