Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

Harsha Narra, Sandeep Saroj, Tarun, Supraj Ranga, Sonu Thakur

డీవీ

, మంగళవారం, 5 నవంబరు 2024 (18:53 IST)
Harsha Narra, Sandeep Saroj, Tarun, Supraj Ranga, Sonu Thakur
లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. నవంబరు 22న ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ, 'నేటి యువతరంకు నచ్చే అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. చిత్రంలోని ప్రతి పాత్ర అందరికి ప్రతి యూత్‌కు కనెక్ట్‌ అయ్యే విధంగా వుంటుంది. రొమాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్‌ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి ప్రమోషనల్‌ కంటెంట్‌కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాను సెలెక్ట్‌గా కొంత మందికి చూపించాం. 
 
అందులో స్టూడెంట్స్‌, ఫ్యామిలీస్‌, యూత్‌ అందరూ వున్నారు. అందరికి సినిమా బాగా నచ్చింది. మా సినిమా నచ్చి డిస్ట్రిబ్యూటర్స్‌ కూడా మంచి రేట్లు ఇచ్చి తీసుకున్నారు. సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్‌గా వుండే ఈటీవీ విన్‌ మా సినిమా డిజిటల్‌ రైట్స్‌ కొనుగోలు చేసి మాకు ధైర్యానిచ్చారు. ముందు నుంచి గుడ్‌ కంటెట్‌ ఈటీవీ సప్టోర్ట్‌ వుంటుంది. ఈ సినిమాతో అది మరో సారి ప్రూవ్‌ అయ్యింది.గుడ్‌ కంటెంట్‌తో రూపొందిన మా సినిమా అన్ని హక్కులు అమ్ముడుపోయాయి. ఈ మధ్య కాలంలో విడుదల ముందు ఓ చిన్న సినిమా అన్ని హక్కులు సేల్‌ అవ్వడం రికార్డే అని చెప్పాలి. ఈ నెల 21న ప్రీమియర్స్‌ ప్లాన్‌ చేస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం అందరికి మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందనే నమ్మకం వుంది' అన్నారు. 
 
దర్శకుడు మాట్లాడుతూ ''ఇదొక సరికొత్త యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌. ఇదొక ఎమోషనల్‌ రైడ్‌, ఈ చిత్రంలో ప్రతి సన్నివేశంలో ఓ ఎమోషన్‌ వుంటుంది. ఆడియన్స్‌ ఈ నెల 22న ఓ సరికొత్త కథను, కొత్త విజువల్స్‌ను, కొత్త మేకింగ్‌ను, కొత్త పాయింట్‌ను చూడబోతున్నారు. ముఖ్యంగా పతాక సన్నివేశాలు, సినిమాలో లాస్ట్‌ 20 నిమిషాలు అందరి హృదయాలను హత్తుకుంటుంది. సినిమా చూసిన వెళ్లిన తరువాత కూడా ఆ పాత్రలు మిమ్ములను వెంటాడుతాయి' అన్నారు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి