Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆన్ లైన్ గేమ్స్ నేపథ్యంలో రొమాంటిక్ ఫ్రీ ఫైర్ లవ్ స్టోరీస్

ఆన్ లైన్ గేమ్స్ నేపథ్యంలో రొమాంటిక్ ఫ్రీ ఫైర్ లవ్ స్టోరీస్
, సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (18:00 IST)
T. Prasannakumar, D. Mahender Reddy and others
కొన్ని తరహా  ఆన్ లైన్ గేమ్స్ కు బానిసలైన యువతరంలో ఎలాంటి దుష్పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయన్న అంశాన్ని ప్రధాన కథావస్తువుగా తీసుకుని ``రొమాంటిక్ ఫ్రీ ఫైర్ లవ్ స్టోరీస్`` చిత్రాన్ని రూపొందించారు. రాకేష్, మహి, రవి, సిరి, రుచిత, వెన్నెల, రంగస్థలం లక్ష్మి ప్రధాన పాత్రధారులుగా సూర్యచక్ర పిక్చర్స్ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో డి.మహేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్ ను సోమవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ముఖ్య అతిథి గా పాల్గొన్న నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ ఆవిష్కరించారు. అనంతరం  టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, `యువతరం చెడు  మార్గం వైపు వెళ్లకుండా  మంచి  మార్గంలో పయనించాలన్న ఓ మంచి పాయింట్ కు, రొమాంటిక్ అంశాలను మిళితం చేసి ఈ చిత్రాన్ని తీశారు. అవార్డుల దర్శకుడు నరసింహ నంది వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి, అనుభవం గడించిన మహేందర్ రెడ్డిలో కూడా మంచి, మంచి చిత్రాలను తీయాలన్న ఫైర్ ఉంది. తప్పకుండా ఆయన ఓ మంచి దర్శకుడవుతాడన్న నమ్మకం ఉంది" అని అన్నారు.
 
చిత్ర దర్శక, నిర్మాత డి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, లోగడ ఉన్న పబ్జీ ఆన్ లైన్ గేమ్ కోవలో ఫ్రీ ఫైర్ అనే ఆన్ లైన్ గేమ్ కు యువతరం ఎలా బానిసలవుతోంది. ఓ గ్రామంలో చదువుకున్న నలుగురు యువకులపై ఆ గేమ్ ఎలాంటి ప్రభావం చూపింది. వారి కుటుంబాలలో ఎలాంటి అలజడి జరిగింది. తర్వాత వారిలో ఎలాంటి మార్పు వచ్చింది అన్న అంశంతో ఈ చిత్రాన్ని మలిచాం. ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇక నా గురించి చెప్పాలంటే. ఫిలిం ఇనిస్టిట్యూట్ లో డైరెక్షన్ కోర్సు పూర్తి చేసిన తర్వాత దర్శకుడు నరసింహ నంది వద్ద దర్శకత్వ శాఖలో శిష్యరికం చేసిన అనంతరం మొదటి ప్రాజెక్ట్ గా ఈ చిత్రం చేశాను " అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సహ నిర్మాతలు గనిరెడ్డి,  ప్రధాన పాత్రధారులు  రాకేష్, రవి, నటులు విశ్వనాధ్ తదితరులు పాల్గొని, చిత్రం గురించి, తమ పాత్రలు గురించి తెలియజేశారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎల్. రాజా, కెమెరా: సాయిసాగర్,,దర్శక, నిర్మాత డి.మహేందర్ రెడ్డి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సౌత్ ఇండియాలోనే రికార్డు క్రియేట్ చేసిన మ‌హేష్‌బాబు చిత్రంలోని క‌ళావ‌తి పాట‌