నాగబాబును వర్మ హర్ట్ చేశారేమో? వర్మ నాతో కూడా... చిరంజీవి వ్యాఖ్య
రాంగోపాల్ వర్మను మొన్న ఖైదీ నెంబర్ 150 ప్రిరిలీజ్ కార్యక్రమంలో విమర్శలతో దుమ్ముదులపడంపై చిరంజీవి సోమవారం నాడు స్పందించారు. నాగబాబు స్వతహాగా ఎక్కువ మాట్లాడరనీ, అలాంటి నాగబాబు ఇలా మాట్లాడారంటే ఎక్కడో వర్మ ఆయనను హర్ట్ చేసి వుంటారని అభిప్రాయపడ్డారు.

అయితే రాంగోపాల్ వర్మ కూడా తనతో చాలా బాగా వుంటారనీ, ఎప్పుడూ తేడాగా మాట్లాడినట్లు లేదన్నారు. అలాంటి వర్మ తన ట్విట్టర్లో ఎందుకు అలాంటి పోస్టులు పెడుతున్నారో తనకు కూడా తెలియదన్నారు. ఏదేమైనా వర్మ ట్వీట్లను తను పాజిటివ్‌గా తీసుకుంటానని చెప్పుకొచ్చారు.