Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెరపై కొత్తగా వుంది : 'నగరం'పై రెజీనా

కథానాయిక ప్రాధాన్యత గల పాత్రలు పలు చేసినా 'నగరం' సినిమాలో తనను తాను చూసుకుంటే కొత్తగా అనిపించిందని నటి రెజీనా తెలియజేశారు. తమిళంలో 'మహానగరం'గా తెలుగులో 'నగరం'గా విడుదలైన ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌ కథానాయకుడు. శ్రీ, చార్లి, రాందాస్‌, మధు కీలక పాత్రలు ప

తెరపై కొత్తగా వుంది : 'నగరం'పై రెజీనా
, మంగళవారం, 14 మార్చి 2017 (20:51 IST)
కథానాయిక ప్రాధాన్యత గల పాత్రలు పలు చేసినా 'నగరం' సినిమాలో తనను తాను చూసుకుంటే కొత్తగా అనిపించిందని నటి రెజీనా తెలియజేశారు. తమిళంలో 'మహానగరం'గా తెలుగులో 'నగరం'గా విడుదలైన ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌ కథానాయకుడు. శ్రీ, చార్లి, రాందాస్‌, మధు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. రెండు భాషల్లో మంచి ఆదరణ పొందుతోందని చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లో ఆనంద సభ ఏర్పాటు చేశారు. లోకేష్‌ దర్శకత్వం వహించారు. ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మాత.
 
సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ.. నేను ఇంతకుముందు చేసిన చిత్రాల్లోనూ కథను నమ్మి చేశాను. కానీ ప్రేక్షకులకు నచ్చలేదు. నగరం సినిమా అందుకు భిన్నమైంది. ఈ చిత్ర కథ విన్నప్పుడే తప్పకుండా విజయవంతం అవుతుందనే నమ్మకం కల్గింది. కథల విషయంలో ఆలోచన సరైందని నిరూపించింది. తమిళంలో బాగా పేరు వచ్చింది. తెలుగులోనూ కొత్తదనం వుంటే ఆదరిస్తారనేందుకు ఈ చిత్రమే వుదాహరణ. విడుదలైన రోజు అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్స్‌తో నడవడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇకపై కూడా భిన్నమైన పాత్రలను, కథలను ఎంచుకుంటానని తెలిపారు.
 
రెజీనా మాట్లాడుతూ... దర్శకుడు కథ చెప్పినప్పుడే పూర్తి నమ్మకం ఏర్పడింది. నా పాయింట్‌ ఆఫ్‌లోనూ కథ సాగుతుంది. అయితే కమర్షియల్‌ అంశాలు లేని కథ, అందుకు తగిన పాత్ర కాబట్టి... విడుదల తర్వాత పలువురు విమర్శించారు. కానీ.. అవేవీ పట్టించుకోకుండా ప్రేక్షకులు సినిమాను ఆదరించడం గొప్ప విషయం. నేను నమ్మి చేసిన చిత్రమిది. దర్శకుడు సరికొత్త ఆలోచనలతో ముందుకు వచ్చాడు. ఇకపై ఇలాంటి భిన్నమైన కథల్లో నటించడానికి ఇష్టపడతానని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య... డిప్రెషనే కారణం...