Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేనే నా లో పురావస్తు శాస్త్రవేత్తగా రెజీనా కసాండ్రా

Advertiesment
Regina Cassandra
, గురువారం, 23 ఫిబ్రవరి 2023 (20:56 IST)
Regina Cassandra
మంచి, యూనిక్ కంటెంట్  ప్రాజెక్ట్‌లు ప్రామెసింగ్ బ్రాండ్ నుంచి వస్తున్నపుడు ప్రేక్షకులు,  ట్రేడ్ సర్కిల్‌లలో మోస్ట్ ఎవైటెడ్ సినిమాగా నిలుస్తాయి. ఎస్పీ సినిమాస్ తమిళ చలనచిత్ర పరిశ్రమ లో ప్రసిద్ధ నిర్మాణ & పంపిణీ సంస్థలలో ఒకటిగా పేరుపొందింది.  ప్రామెసింగ్  ప్రాజెక్ట్‌లను అందిస్తున్న ఎస్పీ  సినిమాస్ తెలుగు పరిశ్రమలోకి తొలి అడుగు వేస్తోంది.  
 
రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో, నిను వీడని నీడను నేనే ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వంలో, ఆపిల్ ట్రీ స్టూడియోస్‌  రాజ్ శేఖర్  వర్మ నిర్మించిన  ‘నేనే నా’ చిత్ర వరల్డ్ వైడ్ థియేట్రికల్ & నాన్-థియేట్రికల్ రైట్స్ ని ఎస్పీ సినిమాస్ దక్కించుకుంది. రాజ్ శేఖర్ ఇంతకుముందు సూపర్‌హిట్ చిత్రం ‘జాంబీ రెడ్డి’ని నిర్మించారు.
 
అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందే చిత్రాలను అందించడంలో ఎస్పీ సినిమాస్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలని ప్రమోట్ చేయడం, మార్కెట్ చేయడానికి సరైన వ్యూహాలను ప్లాన్ చేయడం, భారీ స్క్రీన్స్ అందించడంలో ఎస్పీ సినిమాస్ కి ప్రత్యేక ప్రస్తావన ఉంది. ఎస్పీ సినిమాస్ గోల్డెన్ టచ్‌ 'నేనే నా'కి విశేషమైన రీచ్‌ను అందిస్తుందని ఆపిల్ ట్రీ స్టూడియోస్ భావిస్తోంది.
 
‘నేనే నా’ 1920, ప్రజంట్  - రెండు విభిన్న కాలాల నేపథ్యంలో సెట్ చేయబడిన ఫాంటసీ-అడ్వెంచర్ థ్రిల్లర్. రెజీనా కసాండ్రా ఒక పురావస్తు శాస్త్రవేత్త పాత్రను పోషిస్తుంది.  ఆమె కొన్ని ప్రత్యేకమైన పురాతన వస్తువులను వెలికితీసే మిషన్ సమయంలో మిస్టీరియస్ సంఘటనలకు దారి తీస్తుంది. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, అక్షర గౌడ, జయప్రకాష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.  
 
సామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు సమ్మర్ ట్రీట్  కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ ఫై భారీ ఫైట్ చిత్రీక‌ర‌ణ‌