Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప‌ది త‌ల‌ల‌తో రవితేజ- రావణాసుర ఫస్ట్ లుక్

Advertiesment
ప‌ది త‌ల‌ల‌తో రవితేజ- రావణాసుర ఫస్ట్ లుక్
, శుక్రవారం, 5 నవంబరు 2021 (16:36 IST)
Ravanasura First Look
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్ల మీద అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.
 
నేడు (శుక్రవారం) ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రవితేజ 70వ సినిమాగా రాబోతోన్న ఈ చిత్రానికి రావణాసుర అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక ఇందులో పది రకాల విభిన్న పాత్రలను రవితేజ పోషించబోతోన్నట్టు కనిపిస్తోంది. రావణాసురుడు రామాయణంలో ఎంతో ముఖ్యమైన పాత్ర.
 
ఇక ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌లో రవితేజ దశావతారాల్లో కనిపిస్తున్నారు. పది తలల రావణాసురుడిలా ఉన్నారు. లాయర్ కోర్టు ధరించి సుత్తి పట్టుకుని కూర్చున్నాడు. రక్తం కారుతూ రవితేజ అలా సీరియస్‌గా కూర్చుని ఉండటం చూస్తే కథ మీద ఆసక్తి పెరిగేలా ఉంది. గన్స్ కూడా ఆ పోస్టర్లో కనిపిస్తున్నాయి. హీరోలు అనేవాళ్లు ఉండరు అని పోస్టర్ మీద రాసి ఉంది. అలా ఈ ఒక్క పోస్టర్‌తోనే అందరిలోనూ అంచనాలు పెంచేసింది.
 
రామాయణంలో రావణాసురుడు విలన్.కానీ ఈ చిత్రంలో రావణసుర కథ ఏంటి?
 
రచయితగా శ్రీకాంత్ విస్సా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఆయనే ఈ సినిమాకు కథను అందించారు. సుధీర్ వర్మ తన సినిమాలను ఎంత కొత్తగా, స్టైలీష్‌గా తెరకెక్కిస్తారో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజను ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా చూపించబోతోన్నారు. పోస్టర్‌ను బట్టే మనకు ఆ విషయం అర్థమవుతోంది.
 
కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న రవితేజ 70వ ప్రాజెక్ట్‌ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఉండబోతోంది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేయబోతోన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నందమూరి బాలకృష్ణ స‌ర‌స‌న‌ శ్రుతీ హాసన్