Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

Advertiesment
Rani Mukherjee

ఠాగూర్

, శనివారం, 22 ఫిబ్రవరి 2025 (15:11 IST)
మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలను లైనులో పెట్టారు. ప్రస్తుతం ఆయన "విశ్వంభర" చిత్రంలో ఆయన బీజీగా నటిస్తున్నారు. మరోవైపు, "దసరా" మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. ఒకపుడు తన అందచందాలతో బాలీవుడ్‌ను ఊపేసిన రాణీ ముఖర్జీ ఈ సినిమాలో నటిస్తున్న సమాచారం. 
 
ఈ సినిమాకు హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి నరసన నటించే హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందట. ఆ పాత్రకు రాణీ ముఖర్జీ అయితే బాగుంటుందని శ్రీకాంత్ ఓదెల సూచన చేయగా మెగాస్టార్ చిరంజీవి సైతం సమ్మతం తెలిపినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్‌లో సైతం ట్రెండ్ అవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ: