Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సబ్ మెరీన్ కథతో సినిమానా, పిచ్చా అన్నవారే ఇప్పుడు పొగడుతున్నారు: ఘాజీపై రానా

ఇండియన్‌ సినిమాలో ఇప్పటి వరకూ ఎవరు టచ్‌ చేయని కథ అనే ప్రచారంతో ముందుకొచ్చిన ఘాజీ సినిమాను దగ్గుబాటి రానా తీస్తున్నాడంటే స్నేహితులు, కొంతమంది నిర్మాతలు తనను పిచ్చోడిలా చూశారట. అయితే సినిమా చిత్రీకరణ మొదలు పెట్టి కాస్త వార్తల్లోకి వచ్చాకే కరణ్‌ జోహార్

Advertiesment
సబ్ మెరీన్ కథతో సినిమానా, పిచ్చా అన్నవారే ఇప్పుడు పొగడుతున్నారు: ఘాజీపై రానా
హైదరాబాద్ , గురువారం, 26 జనవరి 2017 (03:57 IST)
ఇండియన్‌ సినిమాలో ఇప్పటి వరకూ ఎవరు టచ్‌ చేయని కథ అనే ప్రచారంతో ముందుకొచ్చిన ఘాజీ సినిమాను దగ్గుబాటి రానా తీస్తున్నాడంటే స్నేహితులు, కొంతమంది నిర్మాతలు తనను పిచ్చోడిలా చూశారట.  అయితే సినిమా చిత్రీకరణ మొదలు పెట్టి కాస్త వార్తల్లోకి వచ్చాకే కరణ్‌ జోహార్, టాన్‌డన్‌ మా సినిమాను హిందీలో రిలీజ్‌ చేయడానికి ముందుకొచ్చారని, టీజర్‌ చూసిన తర్వాత అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడానికి ఒప్పుకున్నారని రానా చెబుతున్నారు. 
 
ఇంతకూ రానాకు ఘాజీ సినిమాను ఉన్న సంబంధం ఏమిటంటే, రానాకు విశాఖ ఆర్కే బీచ్‌కు ఉన్న సంబంధమేనని చెప్పాలి.  ‘‘32 ఏళ్ల నాకు 20 ఏళ్లుగా విశాఖ ఆర్కే బీచ్‌తో పరిచయం ఉంది. అక్కడ ఘాజీ సబ్‌మెరైన్‌ను చూస్తుంటాను కానీ ఘాజీ కథ తెలియదు. విశాఖలో ఇంత గొప్ప కథ జరిగిందని చాలా మందికి తెలియదు. ఇలాంటి సినిమాలో నటించే ఛాన్స్‌ అరుదుగా వస్తుంది’’ అన్నారు హీరో రానా. రానా, తాప్సీ, కేకే మీనన్, అతుల్‌ కులకర్ణి, నాజర్‌ ముఖ్య తారలుగా సంకల్ప్‌ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్, పీవీపీ సినిమాస్‌ నిర్మించిన ‘ఘాజీ’  ఫిబ్రవరి 17న విడుదల కానుంది.
 
‘ఈ  సినిమా నిర్మించడం గర్వంగా భావిస్తున్నా. ఇండియన్‌ సినిమాలో ఇప్పటి వరకూ ఎవరు టచ్‌ చేయని కథ ఇది’’ అని ప్రసాద్‌.వి.పొట్లూరి ధీమాగా చెబుతుంటే ఘాజీ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. రానా అనే పిచ్చోడు ఘాజీలో ఎలా నటించాడు అనడిగితే టీజర్‌లో మెరిపించిన దృశ్యం చూస్తే చాలు అర్థమైపోతుంది. 
 
ఊహామాత్రంగా కూడా అంచనా లేని చోట ఊహలను వాస్తవం చేయడమే కదా సినిమా అంటే..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ సంగీతం అంటే భక్తి.. ఈ సంగీతం భుక్తి..'; యేసుదాస్‌‌కు పద్మవిభూషణ్