సెలబ్రిటీలు అయ్యాక కుటుంబంతో కలిసి పాలుపంచుకోవడం తక్కువే అని చెప్పకతప్పదు. ఇప్పటి పరిస్థితిని బట్టి కష్టమనే అర్థమవుతుంది. ఒకవైపు నటుడిగా, నిర్మాతగా బిజీగా వున్న రామ్‌చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి భోజనం చేయడం అనేది చాలా అరుదైన విషయనట.. ఉపాసన అపోల్ వంటి రంగాలలో బిజీగానూ సామాజిక సేవలో పని ఒత్తిడితో వుండడంతో తన భర్తతో కలిసి టైంను వెచ్చించడం కష్టమనే చెప్పాలి.
సినీరంగంలో వున్న సెలబ్రిటీలు ఏం చేసినా ఆసక్తిగా వుంటుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్, కోడలు ఉపాసనలు ఇద్దరూ లంచ్‌డేట్‌కు వెళ్ళినట్లు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి ఆయన అభిమానులనుంచి మంచి స్పందనే వస్తుంది. సెలబ్రిటీలు అవకాశం చిక్కినప్పుడుల్లా బయటకు వెలుతుంటారు. అలా రామ్‌చరణ్ ఉపసాన ఇద్దరూ వీకెండ్ లంచ్ కు వెళ్ళినట్లు ఫొటో పోస్ట్ చేశారు. అందుకే విదేశాలలో వీకెండ్స్ అంటూ రిలాక్స్‌కు శని ఆవివారంనాడు కేటాయిస్తుంటారు. అది క్రమేణా భారత్‌లోనూ ప్రవేశించింది.
ఏదిఏమైనా ఓ ఆదివారంనాడు రామ్‌చరణ్, ఉపసాన ఇలా లంచ్‌కు వచ్చి కలిసి భోజనం చేశారన్నటమాట. ఇప్పటి తరానికి ఇలాంటివి ఓకేకానీ, వెనుకటి తరం మాత్రం ఇదేం విడ్డూరం అనకమానరు. కనుకనే దివంగత డా. డి.రామానాయుడు లాంటివారే వారానికి ఓ సారి తన కుటుంబసభ్యులందరూ తన ఇంటిలోనే కలిసి లంచ్ చేసేలా పిల్లలతో టైం వెచ్చించేలా ఆయన బతికున్నంతకాలం అమలు చేశారు.