Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'హే జగన్.. నీ చుట్టూ డేంజరస్ పీపుల్స్ ఉన్నారు.. జాగ్రత్తగా ఉండు' : ఆర్జీవి ట్వీట్

Advertiesment
Ram Gopal Varma
, శుక్రవారం, 7 జనవరి 2022 (08:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించడంపై టాలీవుడ్ దర్శకనిర్మాత రాంగోపాల్ వర్మ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారం బాగా ముదిరిపోయింది. ఏపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రశ్నలు సంధించారు. 
 
వీటికి మంత్రులు కూడా ఏమాత్రం తగ్గకుండా ధీటుగా కౌంటరించారు. అయినా ఆర్జీవీ ఈ అంశాన్ని వదిలిపెట్టకుండా సోషల్ మీడియాలోనూ పది లాజికల్ ప్రశ్నలను సంధించారు. ఆ తర్వాత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కౌంటరిచ్చారు. పిమ్మట ఆర్జీవీ సైలెంట్ అయ్యారని అనుకుంటున్న తరుణంలో ఆర్జీవీ మరో బాంబు పేల్చారు. 
 
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన ఓ ట్వీట్ ఇపుడు సెన్షేషన్ అయింది. "వైసీపీలో నేను నమ్మే ఒకే ఒక్క పర్సన్ వైఎస్. జగన్.. చుట్టూ ఉన్న వైకాపా లీడర్స్ ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళ పర్సనల్ ఉపయోగాల కోసం, అజెండా కోసం జగన్‌ను తప్పుగా చూపిస్తున్నారు. హే జగన్... నీ చుట్టూ ఉన్న డేంజరస్ పీపుల్‌తో జాగ్రత్తగా ఉండు" అంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌లో ఏపీ సీఎంను వర్మ హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచు లక్ష్మికి కరోనా.. గో కరోనా గో అని గట్టిగా అరిచినా నన్ను పట్టుకుంది!