Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంపేస్తామని కంటి చూపుతో హెచ్చరిక చేశారు... సపోర్టు చేయండి మేడం ప్లీజ్ : సునీతతో వర్మ

సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతతో సమావేశమయ్యారు. తన తాజా చిత్రం వంగవీటి విడుదలకు విజయవాడకు చెందిన వంగవీటి రాధా అనుచరులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో ఈ చిత్రం విడుదలపై

చంపేస్తామని కంటి చూపుతో హెచ్చరిక చేశారు... సపోర్టు చేయండి మేడం ప్లీజ్ : సునీతతో వర్మ
, ఆదివారం, 4 డిశెంబరు 2016 (16:28 IST)
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతతో సమావేశమయ్యారు. తన తాజా చిత్రం వంగవీటి విడుదలకు విజయవాడకు చెందిన వంగవీటి రాధా అనుచరులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో ఈ చిత్రం విడుదలపై సందిగ్ధత నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో చిత్రం విడుదల కోసం రాంగోపాల్ వర్మ ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టారు. చాలామంది నుంచి తనకు ఈ చిత్రాన్ని విడుదల చేయొద్దని వార్నింగ్‌లు ఇస్తున్నప్పటికీ.. వాటినేం పట్టించుకోకుండా తన పంథాలో దూసుకుపోతున్నాడు. అలాగే.. కొందరి సహాయసహకారాల్ని కోరుకుంటున్నాడు.
 
ఈ క్రమంలోనే వర్మ తాజాగా పరిటాల సునీతతో విజయవాడలో భేటీ అయ్యాడు. 'వంగవీటి' చిత్రాన్ని వక్రీకరించవద్దని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని వంగవీటి అనుచరులు హెచ్చరించిన నేపథ్యంలో తనకు మద్దతునివ్వాలని కోరుతూ ఆమెని వర్మ కలుసుకోవడం ప్రాధాన్యతని సంతరించుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలీజ్‌కు ముందే సరికొత్త రికార్డు.. రామ్ చరణ్ ధృవ సంచలనాలు సృష్టించేనా?