Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వర్మ లేటెస్ట్ ట్వీట్స్.. జక్కన్నే టాప్.. వారంతా సీరియల్ డైరక్టర్లు.. రాక్షసుడిగా మారకముందు?!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. బాహుబలి2పై పడ్డాడు. ఈ సినిమా గురించి కామెంట్స్ చేయడం ద్వారా వార్తల్లోకెక్కాడు. తాజాగా జక్కన్న రాజమౌళి గురించి ట్వీట్ చేశాడు. రాజమౌళి తెరకెక్కించి బాహుబలి ద్వారా

Advertiesment
Ram Gopal Varma
, బుధవారం, 26 ఏప్రియల్ 2017 (18:25 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. బాహుబలి2పై పడ్డాడు. ఈ సినిమా గురించి కామెంట్స్ చేయడం ద్వారా వార్తల్లోకెక్కాడు. తాజాగా జక్కన్న రాజమౌళి గురించి ట్వీట్ చేశాడు. రాజమౌళి తెరకెక్కించి బాహుబలి ద్వారా దేశంలోని మిగిలిన దర్శకులందరూ.. తాము టీవీ సీరియల్ డైరక్టర్లుగా ఫీలయ్యేలా చేసిందంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కానీ ఎప్పుడు విమర్శలకే చోటిచ్చే వర్మ జక్కన్నపై ఎందుకు అంతప్రేమ అంటూ చర్చించుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 
 
అయినప్పటికీ వర్మపై విమర్శలు ఏమాత్రం ఆగలేదు. బాహుబలితో పోలుస్తూ ఇతర దర్శకుల మూవీలను కించపరచడం సరికాదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జక్కన్నతో కలిసి దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేసిన వర్మ.. అందులో నేను అసహ్యంగా ఉన్నానని.. తనకంటే రాజమౌళి చాలా అందంగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఐతే, ఈ ట్వీట్‌కు స్పందించిన రాజమౌళి, అయ్యా నన్ను వదిలేయండి అంటూ రిప్లై ఇచ్చారు.
 
అయితే బాహుబలిపై వర్మ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. 'బాహుబలి-2' కంటే పెద్దది ఒకే ఒకటి ఉందని... అదేంటంటే పర్వతమంత ఈర్ష్య, అసూయ అని వర్మ అన్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో నెలకొన్న భారీ క్రేజ్‌ను సినీ పరిశ్రమలోని ఇతరులు జీర్ణం చేసుకోలేకపోతున్నారని విమర్శించాడు. మల్టీప్లెక్స్ థియేటర్లను 'బాహుబలి-2' సింగిల్ స్క్రీన్ థియేటర్లుగా మార్చివేసిందని వర్మ వ్యాఖ్యానించాడు. ఎందుకంటే.. దేశంలోని మల్టీప్లెక్స్‌ల్లో మాత్రమే ఈ సినిమా ఆడనుందని వర్మ ట్వీట్ చేశాడు.
 
మరోవైపు రామ్ గోపాల్ వర్మ తన చిన్నారి కూతురితో గతంలో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. "నా పూర్వ జన్మకు సంబంధించిన ఒక చిత్రం. రాక్షసుడిగా మారకముందు, నా మానవత్వం ఇంకా బతికున్న మంచి రోజుల్లో నా కూతురితో దిగిన ఫొటో ఇది" అని వర్మ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి-2కి అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్.. దేవసేన కొత్త పోస్టర్ రిలీజ్.. నీలిరంగు చీరలో?