గేమ్ చేంజర్ కోసం దుబాయ్ వెళుతున్న రామ్ చరణ్, ఉపాసన
, గురువారం, 30 మార్చి 2023 (16:25 IST)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్ విమానాశ్రయంలో దర్శనమిచ్చారు. ఉపాసన తో కలిసి ఆయన దుబాయ్ వెళుతున్నారు. వారితో పాటు వారికి ఇష్టమైన చిన్న రైమ్ (పెట్)తో కలిసి దుబాయ్‌కి బయలుదేరారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్యంలో రూపొందుతున్న సినిమాకు చరణ్ పుట్టినరోజున గేమ్ చేంజర్` టైటిల్ ను పెట్టారు.
దుబాయిలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ అంచనాలకు ధీటుగా గేమ్ చేంజర్‌ను నిర్మిస్తున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ కి ఎక్స్ట్రోడినరి రెస్పాన్స్ వస్తుంది.
నటీ నటులు: రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు
సాంకేతిక వర్గం:స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజ్, కో ప్రొడ్యూసర్: హర్షిత్, సినిమాటోగ్రఫీ: ఎస్.తిరుణావుక్కరసు, మ్యూజిక్: తమన్.ఎస్, డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, స్.కె.జబీర్, నరసింహారావ్.ఎన్
తర్వాతి కథనం