'బ్రూస్లీ' తర్వాత రామ్ చరణ్ తన కొత్త సినిమా 'ధృవ' ఈ మధ్యే సెట్స్‌పైకి తీసుకెళ్ళిన విషయం తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన 'తని ఒరువన్'కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఓ సరికొత్త లుక్ ప్రయత్నిస్తున్నారట. ఇప్పటివరకూ తన ప్రతి సినిమాలోనూ ఫిజిక్ పరంగా స్ట్రాంగ్‌గా కనిపిస్తూనే, రకరకాల లుక్స్‌తో మెప్పించిన చరణ్, కొత్త సినిమాలో ఓ పోలీసాఫీసర్ పాత్రలో మరింత కొత్తగా కనిపించనున్నారట.
ఇక ఇందుకోసం రామ్ చరణ్, ఓ ప్రఖ్యాత ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో వర్కవుట్స్ చేస్తున్నారట. అదే విధంగా సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కోసం కూడా రామ్ చరణ్ పలు ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు. గుర్రపు స్వారీతో పాటు పలు ఇతర స్టంట్స్ నేర్చుకుంటున్నట్లు స్వయంగా రామ్ చరణ్ తెలియజేస్తూ, సినిమాలో పాత్ర అవసరం మేరకు కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. ధృవ అన్న టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. త్వరలోనే కశ్మీర్లో ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ మొదలుకానుంది.