Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొహమాటంతో నష్టం జరిగింది... : రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమెకు ఇటీవలి కాలంలో ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. పైపెచ్చు.. ఆమె నటించిన ఒకటి రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి.

Advertiesment
Rakul Preet Singh
, ఆదివారం, 11 మార్చి 2018 (10:36 IST)
టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమెకు ఇటీవలి కాలంలో ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. పైపెచ్చు.. ఆమె నటించిన ఒకటి రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఆమె తమిళం, బాలీవుడ్ వైపు దృష్టిసారించింది. అక్కడ కూడా ఆమెకు అదృష్టం వరించలేదు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, తనకు దక్షిణాదిలో సినీ ఆఫర్లు తగ్గిపోయాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. ఆ వార్తలతో తాను ఏకీభవించబోనని స్పష్టంచేశారు. సినిమాల ఎంపికలో తాను కొన్ని పొరపాట్లు చేసిన మాట నిజమేనని చెప్పింది. తెలిసి కూడా కొన్ని తప్పులు చేశానని... ఒక్కోసారి అలా చేయాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పుకొచ్చింది. 
 
కొన్ని సందర్భాల్లో మొహమాటం వల్ల కొన్ని చేయాల్సి వస్తుందని... అవి కూడా తప్పులు జరగడానికి కారణమవుతాయన్నారు. తన సినిమాలు కొన్ని పరాజయం కావడానికి పైవన్నీ కారణాలే అని తెలిపింది. ఇకపై అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతానని తెలిపింది. ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన తన చిత్రం 'అయ్యారీ' నిరాశపరిచినప్పటికీ... తన నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయని గుర్తుచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ‌మౌళి మూవీలో ఎన్టీఆర్ - చ‌ర‌ణ్ రిలేష‌న్ ఏంటో తెలుసా..?