మల్టీ స్టారర్ ట్రెండ్ ... చైతూ - వెంకీ ప్రాజెక్టుపై భారీ అంచనాలు...
టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీ స్టారర్ ట్రెండ్ సాగుతోంది. రానున్న రోజులలో పలు మల్టీ స్టారర్ ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇందులో నాగ చైతన్య, వెంకటేష్ ప్రాజెక్టుపై అభిమానులలో భారీ అంచ
టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీ స్టారర్ ట్రెండ్ సాగుతోంది. రానున్న రోజులలో పలు మల్టీ స్టారర్ ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇందులో నాగ చైతన్య, వెంకటేష్ ప్రాజెక్టుపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. మామ అల్లుళ్ళ కాంబినేషన్‌లో రానున్న మల్టీ స్టారర్ చిత్రం పల్లెటూరు నేపథ్యంలో సాగేలా ఉంటుందని అంటున్నారు.
కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రంలో వెంకీ సరసన నయనతారని కథానాయికగా ఎంపిక చేసారని, చైతూ సరసన సమంత నటిస్తుందని అన్నారు.
తాజా సమాచారం ప్రకారం చైతూ సరసన రకుల్ ప్రీత్ సింగ్‌ని కథానాయికగా ఎంపిక చేసినట్టు టాక్. ఇదే కనుక నిజమైతే వీరిద్దరు కలిసి నటించడం రెండోసారి అవుతుంది. 2017లో వచ్చిన 'రారండోయ్ వేడుక చూద్ధాం' చిత్రంలో చైతూ, రకుల్ జంటగా నటించారు. గతంలో వెంకటేశ్ జోడీగా నయనతార నటించింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన "లక్ష్మి", "తులసి", "బాబు బంగారం" సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.
ఈ ప్రాజెక్టుని మూడు ప్రొడక్షన్ సంస్థలు నిర్మించనున్నట్టు టాక్. వెంకీ హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్‌తో పాటు పాపులర్ రైటర్ కోన వెంకట్ సంస్థ అయిన కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని రూపొందించనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఈ వివరాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.