తాజాగా తలైవర్ రజినీకాంత్ రెండు నూతన సినిమాలకు సంతకం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను చిత్ర నిర్మాణ సంస్థ నిర్వాహకులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీని సారంశం ప్రకారం, లైకా ప్రొడక్షన్స్‌తో రెండు చిత్రాలకు సంతకం చేశారు, రెండు చిత్రాలకు పూజ నవంబర్ 5న చెన్నైలో జరగనుంది.
లైకా ఛైర్మన్ సుభాస్కరన్, లైకా హెడ్ తమిళకుమారన్ & డిప్యూటీ ఛైర్మన్ ప్రేంశివస్వామితో తలైవర్ రజినీకాంత్ ఫొటోను వారు విడుదల చేశారు. 2021లో అన్నాతై సినిమా తర్వాత రజనీకాంత్ విశ్రాంతి తీసుకున్నారు .కొద్దిరోజులు అనారోగ్యంనుంచి కోలుకుని మరలా ఆయన నటించడానికి సిద్దమయ్యారు. ఇది ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగించే అంశం. తాజా సినిమాల వివరాలను త్వరలో వెల్లడికానున్నాయి.