Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాని కళ్లల్లో నీళ్లు తిరిగాయ్.. 'నిన్నుకోరి' లాంచ్‌లో శివ.. జక్కన్న ఏమన్నారంటే?

''నిన్ను కోరి'' సినిమా పాటలు శుక్రవారం విడుదలయ్యాయి. నాని, నివేధా థామస్ జంటగా నటిస్తున్న నిన్నుకోరి సినిమాకు శివ నిర్వాణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. ఆదిపినిశెట్టి కీలక పాత్ర

Advertiesment
నాని కళ్లల్లో నీళ్లు తిరిగాయ్.. 'నిన్నుకోరి' లాంచ్‌లో శివ.. జక్కన్న ఏమన్నారంటే?
, శనివారం, 1 జులై 2017 (16:12 IST)
''నిన్ను కోరి'' సినిమా పాటలు శుక్రవారం విడుదలయ్యాయి. నాని, నివేధా థామస్ జంటగా నటిస్తున్న నిన్నుకోరి సినిమాకు శివ నిర్వాణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. ఆదిపినిశెట్టి కీలక పాత్ర పోషించాడు. గోపీసుందర్ స్వరాలను సమకూర్చిన ఈ చిత్ర గీతాలు గురువారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఆడియో సీడీలను దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు. 
 
ఈ చిత్ర ఫస్ట్ టికెట్‌ను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. నిన్ను కోరి సినిమా పట్ల తనకు నమ్మకముందని.. తొలిరోజు సినిమా చూడాలనే ఉత్సాహం తనలో ఉందన్నారు. ఈ  చిత్రం ట్రైలర్ తనకు బాగా నచ్చిందని.. నాని, నివేదా థామస్ పోటాపోటీగా నటించారని రాజమౌళి వ్యాఖ్యానించారు. నిన్ను కోరి సినిమా మాత్రం చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని నాని అన్నాడు. 
 
దర్శకుడు శివ మాట్లాడుతూ.. ఆరేడు సంవత్సరాలుగా నానితో సినిమా చేయాలనుకున్నానని.. అది ఇప్పటికే నిన్నుకోరితో కుదిరిందని చెప్పాడు. కథ వినగానే నాని కళ్లల్లో నీళ్లు తిరిగాయ్. సహజ నటనతో ఉమామహేశ్వరరావు పాత్రకు ప్రాణం పోశారని చెప్పాడు. నాని, నివేథా థామస్, ఆదిల మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయని.. ఈ నెల 7వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని దర్శకుడు చెప్పుకొచ్చారు. ఇకపోతే నాని నిన్ను కోరి సినిమా అమెరికాలో 500 స్క్రీన్లపై విడుదల కానుండగా, నిన్నుకోరికి సెన్సార్ బోర్డు ''యూ'' సర్టిఫికేట్ ఇచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగాల్ దాదాతో స్టెప్పులేసిన ''మామ్'' స్టార్ శ్రీదేవి..