Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25 ఏళ్ళనాడే హాలీవుడ్‌ కథ రాశారు, నాన్నతో దెబ్బలాడతాను : రాజమౌళి

రజత్‌, మాజీ మిస్‌ ఇండియా నేహా హింగే హీరో హీరోయిన్‌లుగా, రాజ్‌కుమార్‌ నిర్మాతగా రచయిత విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శ్రీవల్లీ'. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం రాత్రి హైదరాబాద్‌ జె.ఆర్‌.సి.కెన్

Advertiesment
Rajamouli comments on srivalli movie teaser
, మంగళవారం, 24 జనవరి 2017 (14:29 IST)
రజత్‌, మాజీ మిస్‌ ఇండియా నేహా హింగే హీరో హీరోయిన్‌లుగా, రాజ్‌కుమార్‌ నిర్మాతగా రచయిత విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శ్రీవల్లీ'. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం రాత్రి హైదరాబాద్‌ జె.ఆర్‌.సి.కెన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. రాజమౌళి హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
 
మా నాన్న (విజయేంద్రప్రసాద్‌) గారిని చూసి గర్వపడ్డ క్షణాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చెబుతాను.. తాతగారు సంపాదించిన ఆస్తులన్నీ హరించుకుని పోయిన తర్వాత పెద్దనాన్నగారు(శివశంకర్‌ దత్తా), నాన్నగారు ఘోస్ట్‌ రైటర్స్‌గా డబ్బులు సంపాదించుకుని వచ్చేవారు. వారు పేర్లు రైటర్స్‌గా ఎప్పుడు పడతాయనే కోరిక ఉండేది. అలా చాలా సంవత్సరాలు వెయిట్‌ చేసిన తర్వాత జానకిరాముడు సినిమాకు తొలిసారి వాళ్ల పేర్లు తెరపై పడ్డాయి. అప్పుడు ఆ పేర్లు చూసినప్పుడు చాలా గర్వంగా అనిపించింది.
 
మరో గర్వకారణం ఏమంటే... నాన్నగారి దగ్గర అసిస్టెంట్‌ రైటర్‌గా పనిచేస్తున్నప్పుడు పాతికేళ్ల క్రితం ఓ కథ చెప్పారు. రష్యా, అమెరికాలకు చెందిన ఆయుధాలను సముద్రంలో దాయడటం.. ఆ తర్వాత లోపల సమతుల్యత వల్ల అది పేలిపోవడంతో సునామి వస్తుంది. సునామీ గురించి చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు కానీ కొన్ని సంవత్సరాల క్రితం సునామీ వల్ల ఇండియాలో కలిగిన ఎఫెక్ట్‌ చూసి అర్థమైంది. అంటే సునామీ గురించి నాన్నగారు ఎప్పుడో చెప్పారు కదా అని గర్వంగా అనిపించింది. 
 
అలాగే రెండు వారాల గ్యాప్‌లో బాహుబలి, భజరంగీ బాయ్‌జాన్‌... అనే రెండు బ్లాక్‌‌బస్టర్‌ కథలను రాసిన రచయితగా నాన్నగారికి పేరు వచ్చినప్పుడు కూడా నాకు గర్వంగా అనిపించింది. ఇలా నాన్నను చూసి నేను గర్వపడ్డ క్షణాలు చాలా ఉన్నాయి. ఇక 'శ్రీవల్లీ' కథ విన్నప్పుడు ఐడియా బావుంది కానీ, డెవలప్‌మెంట్‌ బాగాలేదని చెప్పాను. ఆయన చేసిన మార్పులతో ఈరోజు కథను చెప్పారు. 
 
స్టోరీ వినగానే స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌‌గా ఉంది. తీయాలంటే చాలా డైరెక్షనల్‌ స్కిల్స్‌ కావాలని చెప్పాను. ఇప్పుడు సాంగ్స్‌, థియేట్రికల్‌ చూశాను. రైటర్‌గా నాన్నెంత గొప్పవారో నాకు తెలుసు. డైరెక్టర్‌‌గా సినిమాను అంత గొప్పగా తీసినప్పుడు నాకు కొడుకుగా గర్వంగా అనిపిస్తుంది. ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. కొడుకుగా గర్వపడ్డా, డైరెక్టర్‌గా దెబ్బలాడుతాను. ఎందుకంటే ఆయన నా సినిమాల్లో తప్పులెతుకుతుంటారు. అలాగే ఈ సినిమా విషయంలో కొడుకుగా గర్వపడ్డా, డైరెక్టర్‌గా దెబ్బలాడే క్షణం కోసం ఎదురుచూస్తుంటాను. శ్రీవల్లీ పెద్ద సక్సెసై నిర్మాతలకు మంచి లాభాలను, టీంకు మంచి పేరు తెస్తుందని భావిస్తున్నానని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరణ్‌ను కాలితో తన్నేంతపని చేశా? ఫోన్ సెక్స్ అలవాటుంది.. అతనితో కలిసి స్నానం కూడా?: ప్రియాంక