Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందమైన ప్రేమ కథా చిత్రంగా రాధా మాధవం ట్రైలర్ : హీరో శ్రీకాంత్

Advertiesment
Radha Madhavam team with  Srikanth

డీవీ

, గురువారం, 1 ఫిబ్రవరి 2024 (15:57 IST)
Radha Madhavam team with Srikanth
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. గ్రామీణ ప్రేమ కథా చిత్రాలకు ఆడియెన్స్ నుంచి ఎప్పుడూ సపోర్ట్ లభిస్తూ ఉంటుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీల్లోని సహజత్వాన్ని ఉట్టి పడేలా ‘రాధా మాధవం’ అనే సినిమాను తెరకెక్కించారు.
 
ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చూస్తే అందమైన ప్రేమ కథా చిత్రమని తెలుస్తోంది. ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. హీరో, దర్శక నిర్మాతలకు మంచి గుర్తింపు తీసుకు రావాలి’ అని కోరారు.
 
 చిత్ర నిర్మాత గోనాల్ వెంకటేష్ మాట్లాడుతూ.. ‘మా సినిమా ట్రైలర్‌ను శ్రీకాంత్ గారు రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఫిబ్రవరిలో మా సినిమా రాబోతోంది. ఆడియెన్స్ మా సినిమాను చూసి సక్సెస్ చేయాలి’ అని అన్నారు. 
 
 హీరో వినాయక్ దేశాయ్ మాట్లాడుతూ.. ‘మా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసిన శ్రీకాంత్ గారికి థాంక్స్’ అని అన్నారు.
  దర్శకుడు ఇస్సాకు మాట్లాడుతూ.. ‘మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన శ్రీకాంత్ గారికి థాంక్స్. చిత్ర నిర్మాణంలో నిర్మాత ఎంతో సహకరించారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలోనే సినిమాను రిలీజ్ చేయనున్నాం. ప్రేక్షకులు మా సినిమాను చూసి ఆదరించాల’ని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గేమ్ ఆన్ తో కొత్త గేమ్ వరల్డ్ లోకి వెళ్లిపోతారు : గీతానంద్