Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలీవుడ్‌లో మరో 'మగధీర'... 'రాబ్‌తా' ట్రైలర్ రిలీజ్.. ఘాటు సీన్స్‌తో మత్తెక్కిస్తున్న కృతిసనన్ (Trailer)

గతంలో ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్‌ హీరోగా వచ్చిన 'మగధీర' ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. గత జన్మ కథాంశంతో అప్పట్లో వచ్చిన ఈ సినిమా బ్లాక బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇలాంటి కాన్సెప్టుతో చాల

Advertiesment
Raabta Official Trailer
, మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (11:45 IST)
గతంలో ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్‌ హీరోగా వచ్చిన 'మగధీర' ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. గత జన్మ కథాంశంతో అప్పట్లో వచ్చిన ఈ సినిమా బ్లాక బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇలాంటి కాన్సెప్టుతో చాలా సినిమాలు వచ్చినా బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాలేదు.
 
తాజాగా బాలీవుడ్‌లో మరోసారి 'మగధీర'లాంటి సినిమా రానుంది. సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, కృతిసనన్‌ జంటగా తెరకెక్కుతున్న హిందీ ఫిల్మ్ 'రబ్‌తా' ట్రైలర్ తాజాగా రిలీజైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే మగధీర సినిమాకు కాపీలా ఉందని అంటున్నారు. 
 
ఇక సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతి సనన్ మధ్య రొమాంటిక్ సీన్లు, ముద్దు సన్నివేశాలు జోరుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇంత హాటుగా, ఘాటుగా కృతిసనన్ గతంలో ఎప్పుడూ, ఏ హీరోతోనూ రొమాన్స్ చేయలేదు. 'రబ్‌తా' చిత్రానికి దినేష్ విజన్ దర్శకత్వం వహించగా, జూన్ 9న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
అదేసమయంలో రెండు నిమిషాల నిడివిగల ఈ వీడియో సినీ లవర్స్ విపరీతంగా ఎట్రాక్ట్ చేసుకుంది. 24 గంటల్లో కోటిపైగా హిట్స్ రావడంతో యూనిట్ ఫుల్‌ఖుషీ అయిపోయింది. ఇక సుషాంత్ యాక్షన్ అదిరిపోయిందని, కృతిసనన్ గత సినిమాల కంటే అన్నివిధాలుగా దూకుడు పెంచిందని అంటున్నారు. ఈ తరహా సినిమాలు బాలీవుడ్‌లో వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేదు. మరి రబ్‌తా ఏం చేస్తుందో చూడాలి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోబో 2.0, రోజుకి రూ.2,00,00,000 పారితోషికం తీసుకున్న అక్షయ్