Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 27 April 2025
webdunia

డ్రగ్స్ వ్యవహారం.. పైసా వసూల్‌తో బిజీ.. ఎవ్వరికీ స్టేట్మెంట్ ఇవ్వలేదన్న పూరీ.. వాట్సపే?

టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న డ్రగ్స్ దందాలో ప్రముఖ సినీ నటుల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ జాబితా రెడీ అయ్యిందని.. మరో లిస్ట్ తయారవుతోందనే ఎక్సైజ్ అధికారులు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నా

Advertiesment
#PaisaVasool #PURIJAGAN #twitter #Drug racket #Raviteja
, శనివారం, 15 జులై 2017 (14:15 IST)
టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న డ్రగ్స్ దందాలో ప్రముఖ సినీ నటుల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ జాబితా రెడీ అయ్యిందని.. మరో లిస్ట్ తయారవుతోందనే ఎక్సైజ్ అధికారులు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అయితే, నోటీసులు అందుకున్న వారంతా డ్రగ్స్ వాడారా? లేదా? అనే విషయాన్ని పక్కనబెడితే... టాలీవుడ్ కొంప ముంచింది మాత్రం వాట్సాపే అని తెలుస్తోంది. 
 
డ్రగ్ ముఠాతో వాట్సాప్ ద్వారా జరిపిన సంభాషణలే టాలీవుడ్ ప్రముఖుల కొంపముంచాయట. ఈ నేపథ్యంలో నోటీసులు అందిన వారిలో తమకు ఈ కేసుకు సంబంధం లేదని కొందరంటే.. నోటీసులు వచ్చినంత మాత్రానా తప్పు చేసినట్లు కాదని.. విచారణకు సహకరిస్తామని మరికొందరు అన్నారు. అయితే ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ మాత్రం డ్రగ్స్ కేసులో తన పేరు వినగానే వెరైటీగా స్పందించాడు. 
 
సోషల్ మీడియాల్లో.. టీవీల్లో తనపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టే రీతిలో తాను ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటిదాకా ఎవ్వరికీ ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. బాలయ్యతో తాను నిర్మిస్తున్న 'పైసా వసూల్' సినిమాను పూర్తి చేసే పనిలో తాను చాలా బిజీగా ఉన్నానని తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివకార్తీకేయన్ కోసం నువ్వా నేనా అంటోన్న నయన-సమంత?